Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలోని ఎన్నో ఖరీదైన స్కూల్స్ ఉన్నాయి అందులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్వాలియర్‌లోని సింధియా పాఠశాల ఒకటిగా భావించవచ్చు. ఈ స్కూల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ విద్యను అభ్యసించారు. అంతేకాకుండా ఈ స్కూల్లో ఎంతోమంది వ్యాపారవేత్తలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చదువుకున్నారు. అప్పట్లో ఈ స్కూల్ కి ఎంతో ప్రత్యేకత ఉండేది. దీనికి తగ్గట్టుగానే ఫీజులు ఉండేవి. అయితే ఈ స్కూల్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
ఎందరో వ్యాపారవేత్తలు చదువుకున్న సింధియా పాఠశాల గ్వాలియర్‌లో సమీపంలో ఉంది. ఇది అన్ని పాఠశాలల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. దీనిని వెయ్యికి పైగా సంవత్సరాలు కలిగిన ఓ పురాతనమైన కోటలో నిర్మించారు.
గ్వాలియర్‌లోని సింధియా స్కూల్ ని 1897లో మాధవరావు మహారాజు ప్రారంభించారు. ఈ స్కూల్లో ముకేశ్ అంబానీనే కాకుండా బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ కూడా చదువుకున్నారు.
ఈ పాఠశాలలో చదవడానికి డబ్బు ఉండడమే కాకుండా.. వారు పెట్టే అడ్మిషన్ కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CAA) ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టెస్టులో ఉత్తీర్ణత సాధించిన వారికే ఈ స్కూల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది.
అడ్మిషన్ కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CAA) ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మొత్తం నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల్లో ఒకటి ఫెయిల్ అయిన సీటు రావడం కష్టమని సమాచారం. అలాగే అప్పట్లోనే ఈ స్కూల్లో చదివే వారికి ప్రీమియం లుక్ లో కనిపించేందుకు యూనిఫామ్ కూడా ఉండేదని తెలుస్తోంది.
ఈ గ్వాలియర్‌లోని సింధియా పాఠశాలలో అంబానీతో పాటు సూరజ్ బర్జాతియా, అనురాగ్ కశ్యప్, అలీ అస్గర్ లు కూడా చదువుకున్నారు. అలాగే ఈ స్కూల్లో ఇతర దేశాలకు సంబంధించిన పిల్లలు కూడా చదువుకునే వారిని సమాచారం.
ఈ పాఠశాలలో చదువుకోవడానికి 11 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు లభించేవి. అలాగే ఈ స్కూల్లో కేవలం 6 నుంచి 8 తరగతులు మాత్రమే ఉండేవి. దీంతోపాటు ఈ స్కూల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు పై తరగతుల్లో ప్రవేశం కూడా ఉండేది కాదట.
ఇక ఈ స్కూల్‌కి సంబంధించిన ఫీజు వివరాల్లోకి వెళితే.. అప్పట్లోనే ఈ పాఠశాలలో చదువుకునే వారు సంవత్సరానికి రూ. 13,25,000 ఫీజు చెల్లించేవారని సమాచారం. అంతేకాకుండా ఈ పాఠశాలలో బుక్స్‌కి కూడా అదనంగా ఫీజు చెల్లించేవారట.
ఇక ఈ స్కూల్‌కి సంబంధించిన ఫీజు వివరాల్లోకి వెళితే.. అప్పట్లోనే ఈ పాఠశాలలో చదువుకునే వారు సంవత్సరానికి రూ. 13,25,000 (ఒక రోజుకుని రూ.4 వేలకు పైగా)ఫీజు చెల్లించేవారని సమాచారం. అంతేకాకుండా ఈ పాఠశాలలో బుక్స్‌కి కూడా అదనంగా ఫీజు చెల్లించేవారట.