Veera Simha Reddy: వీర సింహా రెడ్డి కలెక్షన్స్ ఊచకోత.. బాలయ్య కెరీర్లోనే టాప్.. ఇదేం అరాచకం సామీ!

Veera Simha Reddy Movie worldwide Collections:నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్గా విడుదలైన క్రమంలో మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసింది అనే అంశం మీదనే చర్చ జరుగుతోంది. అ వివరాల్లోకి వెళితే

 
  • Jan 12, 2023, 23:18 PM IST

 

 
1 /5

Veera Simha Reddy Movie worldwide Collections:నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ డాగ్ దగ్గించుకోవడంతో సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన సినిమా కావడంతో పాటు అఖండ లాంటి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణ నటించిన సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.     

2 /5

హనీ రోజ్,  శృతిహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా నైజామ్ ఏరియాలో 265 పైగా ధియేటర్లలో విడుదలవగా కేవలం ఒక్క హైదరాబాదులోనే మొదటి రోజు వెయ్యికి పైగా షోలు పడ్డాయి. ఆంధ్రాలో 410 థియేటర్లు ఏపీ- తెలంగాణలో మొత్తం 875 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొత్తం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 1465 థియేటర్లలో విడుదలైనట్టు అయింది.     

3 /5

అయితే మొదటి రోజు ఊహించిన స్థాయిలో నందమూరి బాలకృష్ణ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ సినిమా థియేటర్లకు ప్రేక్షకులు క్యూలు కట్టడమే గాక కొన్నిచోట్ల అయితే ఎక్స్ట్రా చైర్లు కూడా తెప్పించుకుని వేయించుకుంటున్నారని, ఇలా ఒకప్పుడు పాత సినిమాలకు మాత్రమే జరిగేవని, ఇప్పుడు బాలకృష్ణ ఆ రోజులకు తీసుకెళ్లిపోయాడు అని అంటున్నారు.     

4 /5

ఇక తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో కూడా నిర్మాత మొదటి రోజు 50 కోట్లు గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు, ఒక రకంగా చూసుకుంటే ఇది బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అని చెప్పాలి. ఎంత తక్కువలో తక్కువ వేసుకున్న మొదటి రోజు 30 కోట్ల వరకు షేర్ అందుకునే అవకాశం కనిపిస్తోంది.     

5 /5

రాయలసీమలో ఈ సినిమా అయితే టాలీవుడ్ హిస్టరీ లోనే టాప్ బెస్ట్ ఓపెనింగ్స్ దగ్గించుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో రాయలసీమ వారంతా సినిమా కోసం క్యూలు కట్టి మరీ సినిమా చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.