టీమ్ ఇండియా మాజీ రథ సారధి విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయి సాధించబోతున్నాడు. మార్చ్ 4వ తేదీన మోహాలీలో శ్రీలంకతో జరిగే టెస్ట్ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ వంద టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. ఈ నేపధ్యంలో విరాట్ కోహ్లీ కెరీర్‌లోని మైలురాళ్లను పరిశీలిద్దాం.
Virat Kohli: టీమ్ ఇండియా మాజీ రథ సారధి విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయి సాధించబోతున్నాడు. మార్చ్ 4వ తేదీన మోహాలీలో శ్రీలంకతో జరిగే టెస్ట్ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ వంద టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. ఈ నేపధ్యంలో విరాట్ కోహ్లీ కెరీర్‌లోని మైలురాళ్లను పరిశీలిద్దాం.
విరాట్ కోహ్లీ ..2012 జనవరిలో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై 116 పరుగులతో మెయిడెన్ టెస్ట్ సెంచరీ సాధించాడు.
విరాట్ కోహ్లీ తన తొలి టెస్ట్ హాఫ్ సెంచరీని 2011 నవంబర్ నెలలో వెస్టిండీస్‌పై సాధించాడు. ముుంబైలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో వరుసగా 52,63 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ 2011 జూన్‌లో జమైకాలో వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 4,15 పరుగులు మాత్రమే చేశాడు.
విరాట్ కోహ్లీ కెరీర్‌లో మార్చ్ 4వ తేదీన శ్రీలంకతో జరిగే టెస్ట్ మ్యాచ్ చాలా కీలకం. ఇది అతని కెరీర్‌లో వందవ టెస్ట్ మ్యాచ్. ఇప్పటి వరకూ విరాట్ కోహ్లీ టెస్టుల్లో 7 వేల 962 పరుగులు సాధించాడు. 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ రెండు సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో వరుసగా 115,141 పరుగులు చేశాడు.