Vishnu Priya: బిగ్ బాస్ మేకర్స్ కి విష్ణుప్రియ షాక్.. దిమ్మ తిరిగిపోయే నిజాలు!

Bigg Boss Season 8 Contestants: బిగ్ బాస్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమో.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు అన్ని భాషల్లో మంచి విజయం సాధించిన ఈ షో.. తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకునింది. అయితే కొన్ని సీజన్లు బాగా పాపులర్ కాగా.. మరికొన్ని మాత్రం మాత్రం ఫ్లాప్ అయ్యాయి. తాజాగా బిగ్ బాస్ 8 సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో.. ఈ షోలోకి ఒక ఫేమస్ యాంకర్ కంటెస్టెంట్ గా.. రాబోతోంది అనే వార్త వైరల్ అయింది. 

1 /5

విష్ణుప్రియ భీమినేని గురించి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అనసూయ, రష్మీ లాగా విష్ణుప్రియ కూడా యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని ఈటీవీ షోలలో కనిపించిన ఈ భామ.. ఆ తరువాత సినిమాల వైపు మక్కువ చూపించింది. 

2 /5

అనసూయ,‌రష్మీ సినిమాల్లో కూడా కొద్ది వరకు మెప్పించగలిగిన.. విష్ణు ప్రియ మాత్రం సినిమాలతో అసలు మెప్పించ లేకపోయింది. దీంతో ఇటు బుల్లితెరకి.. అటు వెండితెరకి కాకుండా.. ఆఫర్లు లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈ భామకి బిగ్ బాస్ సీజన్ 8 లో.. ఛాన్స్ వచ్చింది అని వార్తలు గట్టిగా రాసాగాయి..  

3 /5

అయితే ఈ విషయంపై విష్ణు ప్రియ తీసుకున్న నిర్ణయం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా బిగ్ బాస్ షో కి వస్తే తప్పకుండా.. చాలా రోజులపాటు ఆ కంటెస్టెంట్ కి.. ఎంతో కొంత పాపులారిటీ కొనసాగుతూ ఉంటుంది. ఇక విష్ణుప్రియకి.. ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో.స ఆమెకి బిగ్ బాస్ సీజన్ 8 ఛాన్స్ రావడంతో..తప్పకుండా ఆఫర్ ని స్వీకరిస్తుంది అని అనుకున్నారు అందరూ.

4 /5

కానీ విష్ణుప్రియ మాత్రం బిగ్ బాస్ మేకర్స్ కి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు విష్ణుప్రియ భీమినేనికి.. ఒక రోజుకి 30 నుంచి 40 వేలు ఇస్తాము అనగా.. ఆమె మాత్రం 70 నుంచి 80 వేల వరకు డిమాండ్ చేసిందట.

5 /5

అయితే అంత ఇచ్చుకోలేము అని బిగ్ బాస్ మేకర్స్ చెప్పగా.. ఈ ఆఫర్ ని విష్ణు ప్రియ భీమినేని వదులుకున్నట్టు తెలుస్తోంది. ఇక విష్ణుప్రియ తీసుకున్న ఈ డెసిషన్.. చూసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి మళ్ళీ బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెని అప్రోచ్ అవుతారా.. విష్ణు ప్రియ బిగ్ బాస్ లోకి వస్తుందా.. తెలియాలి అంటే ఈ సీజన్ మొదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.