Vitamin D Rich Foods in Telugu: మనిషి శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ డి కీలకమైంది. కాల్షియం సంగ్రహణ, ఎముకల పటిష్టత, ఇమ్యూనిటీ పెంచేందుకు విటమిన్ డి కీలకంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి విటమిన్ డి సులభంగా ఎక్కువగా లభించేది సూర్యరశ్మి నుంచి. ఇది కాకుండా ఐదు రకాల ఆహార పదార్ధాల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
ఫ్యాటీ ఫిష్ సాల్మన్, ట్యూనా, మ్యాక్‌రెల్ చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 100 గ్రాముల సాల్మన్ చేపను తీసుకుంటే అందులో దాదాపుగా 570 ఐయూ విటమిన్ డి ఉంటుంది.
ఫోర్టిఫైడ్ మిల్క్, డైరీ ఉత్పత్తులు పాల ఉత్పత్తులు చాలావరకు విటమిన్ డితో ఫోర్టిఫైడ్ చేస్తున్నారు. ఒక కప్పు ఫోర్టిఫైడ్ పాలలో దాదాపుగా 115-130 ఐయూ విటమిన్ డి ఉంటుంది.
గుడ్డు పసుపు భాగం గుడ్డులోని పసుపు భాగంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా గుడ్డు తినడం వల్ల విటమిన్ డి లోపం ఉండదు. ఒక గుడ్డు పసుపులో 40 ఐయూ విటమిన్ డి ఉంటుంది.
మష్రూం సూర్యరశ్మి ఆధారంగా పండించే మష్రూంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. మష్రూంలో ఎర్గోస్టెరోల్ అనే పోషకం కారణంగా ఎండ తగిలినప్పుడు విటమిన్ డి కింద మారుతుంది
ఫోర్టిఫైడ్ ధాన్యం చాలావరకూ తృణ ధాన్యాలు విటమిన్ డితో ఫోర్టిఫైడ్ అవుతున్నాయి. నాన్ వెజ్ తిననివారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఒక కప్పు ఫోర్టిఫైడ్ ధాన్యంలో 40-100 ఐయూ విటమిన్ డి ఉంటుంది.