Anasuya Simba: ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న అనసూయ 'సింబా'

Simba Movie Streaming on Amazon Prime: జగపతి బాబు, అనసూయ కీలక పాత్రల్లో నటించిన మూవీ సింబా. థియేటర్‌లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుండడంతో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఆద్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 
 

1 /5

వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో సింబా మూవీని మేకర్స్ తెరకెక్కించారు. జగపతి బాబు, అనసూయతోపాటు వశిష్ట, శ్రీనాథ్, కస్తూరి, దివి తదితరులు కీలక పాత్రలు పోషించారు.   

2 /5

మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో తెరకెక్కింది.  

3 /5

అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ మూవీకి గత పది రోజులుగా టాప్‌లో దూసుకుపోతుంది. ప్రస్తుతం టాప్-5లో ట్రెండ్ అవుతోంది.   

4 /5

ప్రకృతి కోపం వస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెరపై చక్కగా చూపించారు. ఈ మూవీలోని డైలాగ్స్, సీన్స్ నెట్టింట బాగానే వైరల్ అయ్యాయి.  

5 /5

డైరెక్టర్ మురళీ మనోహర్ రెడ్డి తొలి సినిమాతో మంచి ప్రశంసలు అందుకున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీతో ఆడియన్స్‌ను మెప్పించాడు.