Rain fall: టాప్ గేర్ లో రుతుపవనాలు.. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం..

Hyderabad: హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. దేశంలో రుతుపవనాలు ఇప్పటికే అన్ని ప్రాంతాలలో విస్తరించాయి. ఈ క్రమంలో కొన్నిగంటలుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది.

1 /6

తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాలు జోరుగా విస్తరించాయి. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా తోడు కావడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోయిన జనాలు వర్షం కురుస్తుండటంతో చల్లని వాతావరణంలో సేదతీరుతున్నారు.

2 /6

ఇక వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలలో వర్షంకురుస్తుందని అలర్ట్ ను జారీ చేసింది. అంతేకాకుండా.. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని తెలిపింది. 

3 /6

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్ర తెలిపింది. ఐఎండీ అంచనాల ప్రకారం.. తెలంగాణలోని పలుజిల్లాల్లో వర్షం కురుస్తుంది. ఇక హైదరాబాద్ లో కూడా ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. కొన్ని గంటల నుంచి హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తుంది.

4 /6

సికింద్రాబాద్,మోహిదీపట్నం, లింగంపల్లి, నల్లగండ్ల, చందానగర్, ఉప్పల్, జీడిమెట్ల, ఖైరతాబాద్, సోమాజీగూడ, మెడ్చల్, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట్, రామాంతాపుర్ వంటి చోట్ల కుండపోతగా వర్షం కురుస్తుంది.

5 /6

ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షంకురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డుమీద అనేక ప్రాంతాలలో గుంతల్లో నీళ్లు చేరిపోయాయి. రోడ్డు పైన ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.

6 /6

పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. అంతే కాకుండా వాహనాదారులు సంయమనం పాటించాలని, ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నట్లు సూచిస్తున్నారు. రాంగ్ రూట్ లు, సిగ్నల్ జంపింగ్ వంటివి చేయోద్దని చెబుతున్నారు.