Marraige Dates: పెళ్లి చేసుకునే వారికి గుడ్ న్యూస్.. జూన్, జులై మాసాల్లోని శుభమూహుర్తాలు ఇవే..

Auspicious wedding dates 2024: కొన్నిరోజులుగా మూఢాలు, శూన్యమాసాలతో పెళ్లిళ్లన్ని వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో యువతకు పండితులు తీపికబురు చెప్పారు. జూన్, జూలై మాసాల్లో శుభమూహుర్తాలు ఉన్నట్లు తెలిపారు.

1 /6

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప అనుభూతి. వివాహ వేడుకలను ప్రతి ఒక్కరు ఎంతో గ్రాండ్ గా చేసుకొవాలనుకుంటారు. ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ ల కోసం అనేక రకాల ఈవెంట్ లను ప్లాన్ చేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క వేడుక ఎంతో గ్రాండ్ గా చేసుకుంటున్నారు. 

2 /6

పెళ్లికయ్యే ఖర్చుల విషయంలో యువత ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.  ఈ నేపథ్యంలో పెళ్లి తమ జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోయేలా ప్లాన్ లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. కొన్నిరోజుల నుంచి పెళ్లిళ్లకు బ్రేక్ పడిందని చెప్పుకొవచచ్చు. కొన్నినెలలుగా వరుసగా మూఢాలు, శూన్యమాసాల వల్ల పెళ్లిళ్లు ఆగిపోయాయి. 

3 /6

ఈ క్రమంలో జూన్ మాసం, జులైలలో పెళ్లికి మూహూర్తాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జూన్ మాసంలో ముఖ్యంగా.. 29, వ తేదీ వివాహానికి ఎంతో యోగ్యంగా ఉందని పండితులు సూచించారు. మంచి మూహుర్తంలో పెళ్లితో ఒకటైతే, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని జ్యోతిష్యులు చెబుతుంటారు.

4 /6

జూలై మాసంలోని 11, 12, 13, 14, 15 తేదీలలో మంచి మూహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జాతక రీత్యా వారి వారి బర్త్ స్టార్ , మొదలగు జాతకాలను విశ్లేషించి, మంచి మూహుర్తంలో ఒక్కటవ్వాలని పండితులు చెబుతున్నారు. ఈ మూహుర్తాలు పెళ్లికి ఎంతో అనువైనవని కూడా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

5 /6

మరోవైపు చతుర్మాసం కారణంగా మరల ఆగస్టు నుంచి అక్టోబరు వరకు శుభమూహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. మరల నవంబర్ లో, డిసెంబరు లో మాత్రమే మంచి మూహుర్తాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే ఇప్పటికైన తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాలని కూడా పండితులు సూచిస్తున్నారు.

6 /6

పెళ్లి మూహుర్తాలకు బ్రేక్ పడటంతో దీనిపైన ఆధారపడిన కళ్యాణ మండపం,  క్యాటరింగ్, బ్యాండ్, మేళతాళాలు, డెకోరేషన్,  వీడియో, ఫోటో గ్రఫీ, ఆర్కేస్ట్రా వంటి వారు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మరల జూన్, జులైలలో మూహుర్తాలు ఉండటంతో వారికి చేతినిండా పని దొరికిందని చెప్పుకొవచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)