Best Courses after Intermediate: దేశంలోని అన్ని ప్రాంతాల్లో స్టేట్ సిలబస్ లేదా సెంట్రల్ సిలబస్‌తో ఇంటర్ అంటే 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులు తరువాత ఏం చేయాలనేది ఆలోచిస్తుంటారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా ఇంకా కొన్ని కోర్సులున్నాయి. ఇవి పూర్తి చేస్తే లక్షల్లో సంపాదించవచ్చు. ఆ కోర్సుల వివరాలు తెలుసుకుందాం.
డిప్లమో ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఈ కోర్సు ఫీజు 1 లక్ష రూపాయలుంటుంది. 6 నెలల్నించి 1 ఏడాది వ్యవదిలో కోర్సు పూర్తి చేయవచ్చు. మంచి జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి.
డిప్లమో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఈ కోర్సు ఫీజు దాదాపుగా 1 లక్ష రూపాయలుంటుంది. 6 నెలల్నించి 1 ఏడాది వ్యవధిలో పూర్తి చేయవచ్చు. కోర్సు పూర్తయితే 70 వేల వరకూ జీతంతో ఉద్యోగం లభిస్తుంది.
డిప్లొమో ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్ ఈ కోర్సు ఫీజు 5 వేల నుంచి 10 వేల వరకూ మాత్రమే ఉంటుంది. 6 నెలల్నించి 1 ఏడాది వరకూ ఉండవచ్చు. కోర్సు పూర్తయితే ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగం లభిస్తుంది.
డిప్లమో ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్ ఈ కోర్సు కూడా ఒక ఏడాది లేదా 6 నెలలకు ఉంటుంది. ఈ కోర్సు ఫీజు 1 లక్ష వరకూ ఉండవచ్చు. జీతం కూడా లక్షల్లో వస్తుంది.
డిప్లమో ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లమో ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పూర్తి చేసిన తరువాత చేయవచ్చు. ఇది కొన్ని నెలలు లేదా ఏడాది కోర్సు ఉంటుంది. ఈ కోర్సు ఫీజు 60 వేల నుంచి 80 వేల వరకూ ఉంటుంది. మంచి శాలరీతో ఉద్యోగం కచ్చితంగా లభిస్తుంది.