Apple Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఆపిల్ ప్రత్యేకమైంది. భిన్నమైంది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అందుకే ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అని అంటారు. ఆపిల్ రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల అద్భుతమైన ఊహించని లాభాలుంటాయి. ఏయే ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
చర్మ సంరక్షణ ఆపిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నిగనిగలాడుతుంటుంది. రోజూ పరగడుపున తినండ వల్ల చర్మం ఎప్పటికీ యౌవనంగా ఉంటుంది
గుండె ఆరోగ్యం ఆపిల్లో ఫ్లెవనాయిడ్స్ లేదా విటమిన్ పి , పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. గుండె పోటు వ్యాధుల ముప్పు తొలగిస్తుంది.
బరువు నియంత్రణకు చెక్ రెడ్ ఆపిల్లో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. దాంతో బరువు తగ్గించేందుకు బెస్ట సోర్స్ అని చెప్పవచ్చు. రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉండి బరువు తగ్గించేందుకు దోహదం చేస్తుంది
ఇమ్యూనిటీ బూస్ట్ ఆపిల్లో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. ఇవి శరీరం ఇమ్యూనిటీని పెంచుతాయి. ఉదయం వేళ తినడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు దూరమౌతాయి
జీర్ణక్రియ మెరుగుదల రోజూ పరగడుపున ఉదయం వేళ ఆపిల్ తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆపిల్ తొక్కల్లో లిక్విఫైడ్ ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేసి కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది