EPFO Updates: ఉద్యోగం చేస్తున్నవారికి పీఎఫ్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతినెలా మీ జీతం నుంచి కట్ చేసే పీఎఫ్ డబ్బులను ప్రభుత్వం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుందో మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి.
EPFO Updates: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గురించి ఉద్యోగులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏదొక కంపెనీ ఉద్యోగి అయినట్లయితే పీఎఫ్ తప్పనిసరిగా ఉంటుంది. మరి ప్రతినెల మీ జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ డబ్బులను ప్రభుత్వం ఎక్కడ పెట్టుబడి పెడుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
గత ఐదేళ్లలో లోన్ వివరాలు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇపీఎఫ్ఓ పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని లోకసభ ఎంపి టి సుమతి కేంద్ర్ ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పశాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే దీనిపై స్పందించారు. ఈపీఎఫ్లో పెట్టుబడులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన పెట్టుబడి సరళి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉంటాయని తెలిపారు.
ఈపీఎఫ్ఓ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో నిరంతరం ఇన్వెస్ట్ చేస్తుంది. భారత ప్రభుత్వంలోని పలు కార్పొరేట్ సంస్థల్లో వాటాల ఉపసంహరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈటీఎఫ్ లలో ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు నిధులను కూడా కేటాయిస్తుంది.
డెట్ సెక్యూరిటీలు, ఈటీఎఫ్ లలో పెట్టుబడి, ఈపీఎఫ్ఓ ప్రభుత్వం సూచించిన పెట్టుబడి విధానాన్ని అనుసరిస్తుంది. దీనిలో డెట్ సెక్యూరిటీలు, ఈటీఎఫ్ లు రెండింటిలోనూ పెట్టుబడులు ఉంటాయి. 2015 మార్చి 31న జరిగిన 207వ సీబీటీ సమావేశంలో ఈటీఎఫ్ లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. మొదటి ఇన్వెస్ట్ ఆగస్టు 2015లో చేశారు.
ఈపీఎఫ్ లో పర్సనల్ స్టాక్స్ లలో పెట్టుబడి పెట్టదు. మార్చి 31, 2024 నాటికి ఈపీఎఫ్ఓ మొత్తం రూ. 24,75లక్షల కోట్ల కార్పస్ ను నిర్వహిస్తుంది. వీటిలో రూ. 22,40,922.30కోట్లు రుణ సాధనాల్లో కేటాయించారు. అలాగే 2,34,921,49కోట్లు ఈటీఎఫ్ లలో కేటాయించారు. గత 7ఏళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్, సంబంధిత ఉత్పత్తుల్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడి గురించి కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఈపీఎఫ్ఓ ఏ వ్యక్తిగత స్టాక్ లో నేరుగా పెట్టుబడి పెట్టదని ప్రభుత్వం తెలిపింది.
ఈపీఎఫ్ఓ 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈటీఎఫ్ లో పెట్టుబడి వివరాలు రూ.22,765.99 కోట్లు, 2018-19: రూ.27,974.25 కోట్లు, 2019-20: రూ.31,501.11 కోట్లు, 2020-21: రూ.32,070.80.84 కోట్లు, 284 కోట్లు, 2022-23: రూ.53,081.26 కోట్లు, 2023-24: రూ.57,184.24 కోట్లు, 2024-25 (అక్టోబర్ వరకు): రూ.34,207.93 కోట్లు.
ఈటీఎఫ్ లు అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈటీఎఫ్ ద్వారా షేర్ల సెట్ లో పెట్టుబడి పెడుతుంది. ఏళ్లుగా ఈటీఎఫ్ లు పెట్టుబడిదారులకు భారీ మొత్తంలో డబ్బులు సంపాదించాయి. షేర్ల మాదిరిగానే ఈటీఎఫ్ లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు చేసి విక్రయిస్తారు.