World Shortest Train: ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే ప్రయాణం కేవలం 1 నిమిషంలో, ఎక్కడో తెలుసా

ప్రపంచంలో అత్యంత చిన్న రైలు ప్రయాణం ఎక్కడ ఎంత సేపు ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. ట్రైన్ ఎక్కినంత సేపు పట్టదు మీ గమ్యస్థానం చేరేందుకు. ట్రైన్ ఎక్కి కూర్చునేంతలో మీరు వెళ్లాల్సిన స్టేషన్ వచ్చేస్తుంది. ఆశ్చర్యంగా ఉందా...అదెక్కడో చూద్దాం

World Shortest Train: ప్రపంచంలో అత్యంత చిన్న రైలు ప్రయాణం ఎక్కడ ఎంత సేపు ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. ట్రైన్ ఎక్కినంత సేపు పట్టదు మీ గమ్యస్థానం చేరేందుకు. ట్రైన్ ఎక్కి కూర్చునేంతలో మీరు వెళ్లాల్సిన స్టేషన్ వచ్చేస్తుంది. ఆశ్చర్యంగా ఉందా...అదెక్కడో చూద్దాం

1 /7

ఈ రైలులో కేవలం రెండు కోచ్‌లు ఉంటాయి. వారి పేర్లు ఓలివేట్, సినాయి. ఈ రైలు ప్రయాణికుల్ని పట్టణంలోని ఒక వైపు నుంచి మరోవైపుకు కేవలం 1 నిమిషంలో చేరవేస్తుంది. ఈ ట్రైన్ గడిచిన కొద్దికాలంగా చాలాసార్లు క్లోజ్ అయింది. 2001లో ఓ ప్రమాదంతో క్లోజ్ చేశారు. ఆ తరువాత 2010 వరకు ఓపెన్ చేయలేదు. 2013లో ఓసారి క్లోజ్ అయింది. 2017లో తిరిగి లాంచ్ చేశారు.

2 /7

లాస్ ఏంజెల్స్ థర్ట్ స్ట్రీట్ టన్నెల్ నుంచి హిల్ స్ట్రీట్ , ఓలివ్ స్ట్రీట్‌కు కలిపే ఈ రైలు 1901 నుంచి 1969 వరకూ నడిచింది. 

3 /7

ఏంజెల్స్ ఫ్లైట్ ఇప్పటి వరకూ కోటికి పైగా ప్రయాణికుల్ని చేరవేసింది. ఈ ట్రైన్ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ స్నేహితుడు కర్నల్ జేడబ్ల్యూ ఏడీ నిర్మించాడు

4 /7

ఏంజెల్స్ ఫ్లైట్ రైలు ప్రయాణ సమయం కేవలం 1 నిమిషంలో పూర్తయిపోతుంది. ఈ ట్రైన్ కేబుల్ ఆధారంగా నడుస్తుంది. 33 డిగ్రీల కోణంలో 315 అడుగుల దూరం ప్రయాణిస్తుంది. గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా నడుస్తుంది

5 /7

ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే లైన్ పేరు ఏంజెల్స్ ఫ్లైట్ రైల్వే. ఈ రైలు కాలిఫోర్నియా డౌన్‌టౌన్ లాస్ ఏంజెల్స్‌లోని థర్డ్ స్ట్రీట్‌ను ఓలివ్ స్ట్రీట్‌తో కలుపుతుంది. ఇదొక నారో గేజ్ ప్యూనిక్యులర్ రైల్వే. 

6 /7

ప్రపంచంలోనే అతి చిన్న రైలు అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉంది. ఈ రైలులో ప్రయాణం కేవలం 90 మీటర్లు.  కిలోమీటర్‌లో పదో భాగం కూడా ఉండదు. కేవలం 1 నిమిషంలో జర్నీ ముగుస్తుంది. 

7 /7

ప్రపంచవ్యాప్తంగా రైలు ప్రయాణం అందరికీ ఇష్టం. కొన్ని రైల్వే ప్రయాణాలు రోజుల తరబడి ఉంటాయి. కొన్ని గంటల తరబడి ఉంటాయి కానీ ప్రపంచంలోనే అతి చిన్న రైలు జర్నీ కూడా ఉంది. ఈ రైలులో జర్నీ సమయం కేవలం 1 నిమిషం ఉండవచ్చు అంతే.