Countries with Midnight Sun: రవి అస్తమించని ఆరు దేశాలు, మిడ్ నైట్ సన్ ఎంజాయ్ చేయండి

నాడు బ్రిటీషు సామ్రాజ్యాన్ని గురించి రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్మమని పిలిచేవారు. అదెంతవరకూ నిజమో కానీ ఈ దేశాల్లో మాత్రం రవి అస్తమించడు. ప్రపంచంలోని ఈ ఆరు దేశాల్లో సూర్యాస్తమయం అనేది ఉండదు. రాత్రి వేళ కూడా పగలే ఉంటుంది. ఉన్న సమయాన్ని పగలు రాత్రుల్లో విభజించుకోవాలి. అందుకే ఈ ప్రాంతాల్ని మిడ్ నైట్ సన్ అని కూడా పిలుస్తారు. 

Countries with Midnight Sun: నాడు బ్రిటీషు సామ్రాజ్యాన్ని గురించి రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్మమని పిలిచేవారు. అదెంతవరకూ నిజమో కానీ ఈ దేశాల్లో మాత్రం రవి అస్తమించడు. ప్రపంచంలోని ఈ ఆరు దేశాల్లో సూర్యాస్తమయం అనేది ఉండదు. రాత్రి వేళ కూడా పగలే ఉంటుంది. ఉన్న సమయాన్ని పగలు రాత్రుల్లో విభజించుకోవాలి. అందుకే ఈ ప్రాంతాల్ని మిడ్ నైట్ సన్ అని కూడా పిలుస్తారు. 
 

1 /6

కెనడా కెనడాలోని ఉత్తర ప్రాంతంలో ప్రతక్యేకించి నునావృత్‌లో కూడా అర్ధరాత్రి సమయంలో సూర్యుని చూడవచ్చు. ఇక్కడ జూన్ నెలాఖరువరకూ సూర్యాస్తమయం ఉండదు.

2 /6

అలాస్కా అమెరికాలోని ఈ ఉత్తర భాగంలో మే నెలాఖరు నుంచి జూలై వరకూ అర్ధరాత్రి సూర్యుడిని చూడవచ్చు. దాదాపుగా 80 రోజులు అలాస్కాలో సూర్యాస్తమయం ఉండదు.

3 /6

ఐస్‌ల్యాండ్ యూరప్‌లోని ఈ ద్వీప దేశంలో జూన్ నెలలో అసలు రాత్రనేది ఉండదు. ఆకాశంలో సూర్యుడు క్షణకాలం అస్తమించినట్టు కన్పిస్తాడు. కానీ చీకటి పడదు

4 /6

ఫిన్‌ల్యాండ్ ఫిన్‌ల్యాండ్ ఉత్తర ప్రాంతంలో అర్ధరాత్రి సూర్యుడిని చూడవచ్చు. వేసవిలో అయితే 73 రోజుల వరకూ సూర్యాస్తమయం జరగదు. చలికాలంలో అసలు సూర్యోదయమే ఉండదు.

5 /6

స్వీడన్ మే నెల ప్రారంభం నుంచి ఆగస్టు చివరి వరకూ స్వీడన్ దేశంలో సూర్యుడు అర్ధరాత్రి అస్తమిస్తాడు. తిరిగి సూర్యోదయం 4 గంటలకు అయిపోతుంది. ఇలా ఏడాదిలో 6 నెలలుంటుంది

6 /6

నార్వే నార్వేను ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ అని అంటారు. ఆర్కిటిక్ సర్కిల్‌ లో ఉండటం వల్ల నార్వేలో జూలై నెలాఖరు వరకూ దాదాపుగా 76 రోజులు సూర్యాస్తమయం జరగదు.