Siachin: సియాచిన్ పర్వత శ్రేణులు అన్నింటికంటే ఎత్తైన శిఖరాలే కాకుండా ఎత్తైన యుద్ధ ప్రాంతాలుగా ప్రసిద్ధి. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఎదురెదురుగా యుద్ధం ఎప్ప్పుడూ జరగకపోయినా..దాదాపుగా అదే పరిస్థితి ఉంటుంది.
Siachin: సియాచిన్ పర్వత శ్రేణుల్లోని సైనికులు అధిక శాతం వాతావరణం కారణంగా మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. సియాచిన్‌ను గులాబీల నేలగా అభివర్ణించినా ఆ పరిస్థితి ఎప్పుడూ ఉండదు. అనుక్షణం యుద్ధభయం వెంటాడుతుంటుంది. 24 గంటలూ వాతావరణం భయపెడుతుంటుంది.
సియాచిన్ అంటే గులాబీ అని అర్ధం. సియాచిన్‌లో ఎటు చూసినా మంచు తప్ప మరేదీ కన్పించదు. కానీ బాల్టిస్తాన్ బలాతీలో మంచును గులాబ్ అంటే రోజ్ అని పిలుస్తారు. సియా అంటే రోజ్ అని అర్ధం.
సియాచిన్ అనేది కారోకోరమ్ శ్రేణుల్లో వస్తుంది. ఇదొక గ్లేసియర్ ప్రాంతం. ఉత్తర, దక్షిణ ధృవం గురించి మాట్లాడుకుంటే ఇంచుమించు అలాంటిదే అనవచ్చు.
సియాచిన్ వాతావరణం, అక్కడి నేల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణం పోతుంది.
1984 కు ముందు మానవ సంచారం లేదిక్కడ. పాకిస్తాన్ దురాక్రమణ నేపధ్యంలో ఇండియా ఇక్కడ సైన్యాన్ని మొహరించింది.
సియాచిన్ యుద్ధ పర్వతాలు వార్తల్లో రావడానికి కారణం ఓ బంకర్లో ఓసారి మంటలు రేగడంతో ఒక అధికారి మరణించగా ముగ్గురు సైనికులు మరణించారు.