Youtube Ad-free: యూట్యూబ్ ప్రీమియం లేకుండా వీడియోలన్నీ యాడ్ ఫ్రీగా చూడవచ్చు..ఈ ఆప్షన్ మీకోసమే..

Ad Free Youtube For Android: ప్రస్తుతం చాలామంది యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ కట్టలేక యాడ్ ఫ్రీ వీడియో స్ట్రీమింగ్ ఆప్షన్‌ని పొందలేకపోతున్నారు. ఇకనుంచి యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కట్టనక్కర్లేదు. కేవలం ప్లే స్టోర్‌లో ఉండే ఒక యాప్ తో యూట్యూబ్‌లోని వీడియోలన్నీ యాడ్ ఫ్రీగా చూడవచ్చు.

  • Feb 07, 2024, 18:39 PM IST
1 /6

ప్రస్తుతం యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని గూగుల్ విపరీతమైన యాడ్సను వీడియో మధ్యలో జనరేట్ చేస్తోంది. దీని కారణంగా వీడియో చూసే సమయంలో చాలామందికి అంతరాయం కలుగుతుంది. అయితే యాడ్ ఫ్రీ వీడియోస్ స్ట్రీమింగ్ కోసం చాలామంది యూట్యూబ్ లైట్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఈరోజు మీకు యూట్యూబ్‌లో యాడ్ ఫ్రీగా వీడియోలను ఎలా చూడాలో తెలియజేయబోతున్నాం.

2 /6

3 /6

యాడ్ ఫ్రీ యూట్యూబ్‌ని పొందడానికి ముందుగా ప్లే స్టోర్‌కి వెళ్లాల్సి ఉంటుంది. ప్లే స్టోర్‌లో Video Lite అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.

4 /6

ఈ వీడియో లైట్ అనే యాప్‌ని ఓపెన్ చేసిన తర్వాత మీకు మొదటగా నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మొదటిది యూట్యూబ్ రెండవది యూట్యూబ్ మ్యూజిక్, మూడవది ఇంస్టాగ్రామ్, నాల్గవది టిక్ టాక్. ఇందులో మొదటి ఆప్షన్ పై క్లిక్ చేయాలి.  

5 /6

ఇలా మొదటి ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్‌లో ఉండే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు పక్కనే కనబడుతున్న ప్రొఫైల్ అనే ఆప్షన్‌లోకి అందులో మీ జీమెయిల్ డీటెయిల్స్‌ను టైప్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది.

6 /6

అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ చేసిన తర్వాత ఎప్పటిలాగే వీడియో లైట్ యాప్‌లో మీ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీకు నచ్చిన అన్ని రకాల వీడియోలు యాడ్ ఫ్రీగా పొందవచ్చు. ఇందులో వీడియోలను యాడ్ ఫ్రీగా అన్లిమిటెడ్ చూడవచ్చు.