Google Trending Video Today: షాపింగ్ అనేది సాధారణ విషయం.. ప్రస్తుతం ఉన్నవాళ్లు లేనివాళ్లు అని లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక వస్తువును షాపింగ్ చేస్తూనే ఉంటారు. అయితే కొంతమంది వస్తువులను షాపుల్లో కొంటే మరికొంతమంది మాత్రం మాల్స్ లోనే కొనుగోలు చేస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్కడపడితే అక్కడ వస్తువులను కొనుగోలు చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం నగరాల్లో మాల్స్ వినియోగం పెరగడంతో అందరూ వాటిళ్లలోనే వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.
Typical Walmart In Texas pic.twitter.com/tBeLlofToL
— MadVids (@MadVidss) September 21, 2023
ప్రతి మాల్ లో వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఒక స్థలం కేటాయిస్తారు. అందరూ ఈ ప్రత్యేక స్థలాల్లోనే వారి వాహనాలను పార్కింగ్ చేసి షాపింగ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మాల్స్ లలో జంతువులకు ఎలాంటి ప్రవేశం ఉండదు. కానీ ఓ వ్యక్తి గుర్రంపై ఎక్కి మాల్ లో షాపింగ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నీకు ఈ వీడియోను చూస్తే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, గుర్రంపై ఎక్కి స్వారీ చేయాలి గానీ షాపింగ్ చేయడం ఏమిటని మీ మైండ్లో క్వశ్చన్ ల మీద క్వశ్చన్ లు రావచ్చు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు గుర్రాన్ని తీసుకొని నేరుగా మాల్ లోకి ప్రవేశించాడు. అంతేకాదండోయ్ ఆ గుర్రం పైన ఎక్కి ఓ బుట్ట పట్టుకుని తన కొనాలనుకున్న వస్తువులన్నీ నేరుగా గుర్రంపై నుంచే ఆ బుట్టలో వేస్తుండడం మీరు గమనించవచ్చు. ఇలా ఆ తెల్లటి వ్యక్తి గుర్రంపైనే తిరుగుతూ షాపింగ్ మాల్ మొత్తం చుట్టేశాడు. ఇలా తను కావాలనుకున్న వస్తువులన్నీ గుర్రంపై నుంచి బుట్టలో వేసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
షాపింగ్ మాల్ లో ఉన్న వాళ్లు ఇలా అంటున్నారు:
మేము ఈ షాపింగ్ మాల్ కి ఎన్నోసార్లు వచ్చాము కానీ ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడూ చూడలేదని. గుర్రంపై వచ్చి ఇప్పటికీ ఏ వ్యక్తి షాపింగ్ చేయలేదని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది అయితే ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోను @MadVidss అనే X సోషల్ మీడియా ID నుంచి షేర్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగదారులు తమ అభిప్రాయాలను కామెంట్లు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా గుర్రం మీద షాపింగ్ కి రావడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయమే..
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook