మొబైల్ రంగంలో సంచలనం సృష్టించిందెవరంటే నిస్సందేహంగా రిలయన్స్ ( Reliance ) పేరే చెప్పుకోవాలి. హర్ ముట్టీమే ముబైల్ అనే నినాదమే నిజమైంది. ఇప్పుడు 5జీ ( 5G Network ) రంగంలో మరో అద్భుత ఆఫర్ ప్రవేశపెట్టబోతోంది.
మొబైల్ ఫోన్స్ నెట్వర్కింగ్ లో రిలయన్స్ దే అగ్రస్థానం. ఇప్పటికే ఈ రంగంలో రిలయన్స్ సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు మరో అద్భుత ఆఫర్ అందించేందుకు సిద్ధమైంది. టెలికాం రంగం ( Telecom sector ) లో జియో ( JIO ) తో పెనుమార్పులు చేసిన రిలయన్స్ ..ఇప్పుడు 5జీ పై దృష్టి పెట్టింది. త్వరలో ఇండియాలో 5జీ అందుబాటులో రానుంది. ఈ తరుణంలో వివిధ కంపెనీలు ఇప్పటికే 5జీ ఫోన్లు ( 5G Mobiles ) అందుబాటులో తీసుకొస్తున్నా ధరలు మాత్రం సామాన్యుడికి అందుబాటులో లేవు. వీటి ధర కనీసం 27 వేలకు పైనే ఉంది.
ఈ నేపధ్యంలో గతంలో హర్ ముట్టీమే మొబైల్ అనే రిలయన్స్ నినాదాన్ని మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు 5జీ మెుబైల్ ( World's Cheapest 5g mobile ) అందించాలనే లక్ష్యంతో త్వరలో రిలయన్స్ నుంచి 5జీ మొబైల్ లాంచ్ చేస్తామని ప్రకటించింది. దీనికోసం గూగుల్ ( Google ) తో రిలయన్స్ చేతులు కలిపింది. ఇండియాలో 2జీ మొబైల్స్ ను వాడే వినియోగదారులు ఇంకా 35 కోట్ల వరకూ ఉన్నారనేది ఓ అంచనా. అంటే భారతదేశ జనాభాలో దాదాపు 25 శాతం. రిలయన్స్ ఇప్పుడు వీరిని లక్ష్యంగా ఎంచుకుంది. అంటే సామాన్యులు సైతం 5జీ మొబైల్ వాడేలే చేయడమే సంస్థ లక్ష్యం.
ప్రస్తుతానికి ధర ఎంతన్నది నిర్ణయించకపోయినా అతి తక్కువకు అందించడానికి సన్నాహాలు చేస్తోంది. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్ ను బట్టి..రిలయన్స్ అందించే 5జీ మొబైల్ ధర..2 వేల 5 వందల నుంచి 3 వేల వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. Also read: Google latest: అలా హమ్ చేస్తే చాలు..పాట ఏంటన్నది చెప్పేస్తుందిక