Rice Grains From Eyes: కంట్లోంచి బియ్యం గింజలు, ప్లాస్టిక్ కవర్లు, వింత పదార్థాలు.. వీడియో వైరల్

Rice Grains From Eyes, Video Goes Viral: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్ణాపురం గ్రామంలో ఒక వింత  ఘటన చోటుచేసుకుంది. భూక్య సౌజన్య అనే ఒకటవ తరగతి చదువుతున్న 6 సంవత్సరాల బాలిక కంటి నుండి బియ్యపు గింజలు, ప్లాస్టిక్ ముక్కలు, ఇనుప ముక్కలు బయటకు రావడం కలకలం సృష్టించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2023, 05:41 AM IST
Rice Grains From Eyes: కంట్లోంచి బియ్యం గింజలు, ప్లాస్టిక్ కవర్లు, వింత పదార్థాలు.. వీడియో వైరల్

Rice Grains From Eyes, Video Goes Viral: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్ణాపురం గ్రామంలో ఒక వింత  ఘటన చోటుచేసుకుంది. భూక్య సౌజన్య అనే ఒకటవ తరగతి చదువుతున్న 6 సంవత్సరాల బాలిక కంటి నుండి బియ్యపు గింజలు, ప్లాస్టిక్ ముక్కలు, ఇనుప ముక్కలు బయటకు రావడం కలకలం సృష్టించింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. పెద్ద కృష్ణాపురం గ్రామానికి చెందిన భూక్య సౌజన్య అనే బాలికకు గత పది రోజులుగా కంటి నుండి బియ్యపు గింజలు, ప్లాస్టిక్, ఇనుప ముక్కలు వస్తుండటంతో ఆమె తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

తమ చిన్నారికి ఏమైనా అనారోగ్య సమస్య వచ్చిందా ? లేక ఏమైనా వింత జబ్బు సోకిందా అని భూక్య సౌజన్య తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏ కారణం చేత ఇలా జరుగుతోందని.. ఎవ్వరికీ, ఎప్పుడూ లేని సమస్య తమ పాపకే ఎందుకు ఎదురైందంటూ భూక్య సౌజన్య తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భూక్య సౌజన్య తల్లిదండ్రుల దుస్థితి ఇలా ఉంటే.. ఈ ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా అక్కడికి క్యూ కట్టి వింతగా చూస్తూ వారిని మరింత భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఆనోటా ఈనోటా ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వాళ్లు ఇప్పుడు భూక్య సౌజన్య పరిస్థితిని తమ కళ్లారా చూసేందుకు పెద్ద కృష్ణాపురానికి క్యూకట్టారు.

ఇదిలావుంటే చికిత్స నిమిత్తం భూక్య సౌజన్యను ఖమ్మం హాస్పిటల్‌కి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు సైతం భూక్య సౌజన్య కంట్లోంచి అవిఇవీ రావడం చూసి అవాక్కయ్యారు. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతే అసలు సమస్య ఏంటనేది తెలుస్తుందని.. అప్పటి వరకు తగిన చికిత్స అందిస్తామని వైద్యులు చెబుతున్నారు. సౌజన్య సమస్యపై స్పందించిన తల్లిదండ్రులు.. తమది నిరుపేద కుటుంబమని.. ప్రభుత్వమే చొరవ తీసుకుని తమ పాపకు చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x