Real Ghost Viral Video Trend In Google: సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటినుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా కొత్త కొత్త ఫీచర్లతో అప్డేట్ అవుతూ వస్తున్నాయి. ఇటీవలే అన్ని సోషల్ మీడియాలో రీల్స్‌తో పాటు షార్ట్స్ అనే కొత్త ఆప్షన్ తీసుకువచ్చాయి. ఇందులో నుంచే ప్రతిరోజు లక్షలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే జనాలు కూడా ఎక్కువగా వీటిలలో వీడియోస్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రతిరోజు వైరల్ అయ్యే వీడియోలో చాలా వరకు జంతువులు, వింత సంఘటనలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ అంశాలకు సంబంధించిన వీడియోలను నెటిజన్స్ ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ దెయ్యానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి? ఆ వీడియోలో ఉన్నది నిజంగా దెయ్యమేనా? ఆ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే..ఓ రహదారిపై తెలుపు రంగు దుస్తులు ధరించిన దెయ్యం నడుచుకుంటూ వెళ్తోంది. ఆ రోడ్డు వెంట బైక్ పై వెళ్తున్న వారు ఆ దయ్యాన్ని చూస్తూ.. అది నడుస్తున్న వైపే బైక్ లైట్లను కొడుతూ హార్న్‌లను వేస్తున్నారు. దీనిని గమనించిన ఆ దెయ్యం ఓ నాలుగు సెకండ్ల పాటు బైక్ హారన్లను కొడుతున్న వారి వంక తిరిగి చూసింది.
దీంతో వారంతా ఎంతో భయంతో మాట్లాడుతున్న మాటలు మీరు వీడియోలో వినొచ్చు. ఇలా ఆ దెయ్యం కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళింది.. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ దెయ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ దెయ్యాలు రోడ్లమీద కూడా తిరుగుతాయా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
ఈ వైరల్ అవుతున్న వీడియోను @Get_Fit_With_Vishal యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ వైరల్ అవుతున్న దెయ్యం వీడియోని లక్షలాదిమంది వీక్షించారు. అంతేకాకుండా 5 వేలకు మందికి పైగా లైక్ చేశారు. కొంతమంది నేటిజన్స్ ఈ వీడియో పై స్పందిస్తున్నారు. ఇది దెయ్యం కాదని ఏలియన్ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఈ రీల్ షేర్ చేసిన వారే దెయ్యాన్ని యానిమేట్ చేశారని అంటున్నారు.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter