నేడు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి

మార్చి 30, సోమవారం నాడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Last Updated : Mar 30, 2020, 01:06 PM IST
నేడు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి

మేష రాశి 30 మార్చి 2020

ఉద్యోగస్తులకు అధికారుల సహకారం లభిస్తుంది. ఈ రోజు చాలా పని చేయాల్సి ఉంటుంది, కాని భయపడవద్దు. మీరు మీ భాగస్వామి నుండి ప్రేమ, ఆనందాన్ని పొందగలుగుతారు. సంపద విషయంలో లాభం చేకూరుతుంది. ఎప్పటి నుండో సంక్లిష్టంగా ఉన్న సమస్యలను ఇవాళ పరిష్కరించుకోవడం ఇవాళ మీకు సులభతరం అవుతుంది. పెట్టుబడులు పెట్టేవారితో పాటు అన్ని రంగాల వారికి ఏదైనా మంచి జరిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉండవచ్చు.

వృషభ రాశి 30 మార్చి 2020

వ్యాపారం బాగానే ఉంటుంది. పాత డబ్బు తిరిగొచ్చే అవకాశాలున్నాయి. భూమి, ఇతర స్థిరాస్తి విషయాలలో లాభాలు పొందే అవకాశాలున్నాయి. గతంలో ఏదో ఓ కారణం వల్ల ఏదో ఓ చోట డబ్బులు చిక్కుకుపోయి ఉంటే, అది ఈ రోజు మీకు తిరిగొచ్చే అవకాశం ఉంది. రుణాన్ని ఎదుర్కోవటానికి సహకారం, మార్గం కూడా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. మీరు మీ తండ్రి నుండి పూర్తి సహాయ సహకారాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మిథున రాశి 30 మార్చి 2020

ద్వంద వైఖరి ఆలోచనలతో పనిపై ఏకాగ్రత కుదరకపోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. పనిపై మనస్సు పెట్టలేకపోవచ్చు. కొంత ఆందోళన కూడా ఉంటుంది. వివాదాల్లో చిక్కుకోవడం మానుకోండి. పనిలో ఏకాగ్రత లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పవు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. కొందరికి ఉద్యోగంలో మార్పుచేర్పులు చోటుచేసుకుంటాయి. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. అధిక ఖర్చులు పెరగవచ్చు. పొట్టలో అనారోగ్యం, కొంత మానసిక ఒత్తిడి కూడా ఉండే ప్రమాదం గోచరిస్తోంది.

కర్కాటక రాశి 30 మార్చి 2020

అదృష్టం, కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు, కొన్ని పనిలో ఉన్న వైవిధ్యాల కారణంగా, మీరు కూడా ప్రయోజనం పొందవచ్చు. పాత పనిని పరిష్కరించడానికి, కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే మంచి రోజు. మీ ముఖ్యమైన పనులు కూడా పూర్తవుతాయి. ప్రమాదకర సాధనలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ సమయం స్నేహితులతో గడపవచ్చు. మీ స్నేహితులకు సంబంధించిన చాలా పనులు కేవలం మీ సహాయంతో మాత్రమే జరుగుతాయి.

సింహ రాశి 30 మార్చి 2020

పనిచేసే చోట, వ్యాపారంలో శత్రువులపై విజయం సాధించవచ్చు. కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు. మీరు మీ రంగాలలో ఇతరుల సహాయసహకారాలతో పాటు విజయాన్ని పొందవచ్చు. పెట్టుబడులు లాభాల్ని చేకూర్చుతాయి. ఈ రోజు మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీరు చేసిన పని నుండి ప్రయోజనం పొందుతారు. సంతానం వల్ల ఆనందం, ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు. ఈ రోజు డబ్బు, కుటుంబం గురించి మీ ఆలోచన విధానం సరిగ్గా ఉంటుంది.

కన్యా రాశి 30 మార్చి 2020

పనిచేసే పనితీరు పెరుగుతుంది. ఫలితంగా పనిచేసే చోట ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. వ్యాపారంలో లాభాలు సంపాదిస్తారు. ఈ రోజు ప్రేమికుడు, ప్రేయసి, జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీకు ఇవాళ అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి. ప్రేమలో విజయం మీలో ఇప్పటి వరకు ఉన్ననైరాశ్యాన్ని పారదోలుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు. రాబోయే కాలంలో మీరు పురోగతి సాధించడంలో విజయవంతం కావచ్చు.

తులా రాశి 30 మార్చి 2020

మీరు ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. పని చేసే చోట కూడా పూర్తి జాగ్రత్త వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామి ఇవాళ మీపై కోపంగా ఉండవచ్చు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాస్త సంయమనం పాటించడం మీకు మంచిది. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి. పనిచేసే చోటఏదైనా కొత్త నిర్ణయం తీసుకోకండి. అలసట కూడా ఉండవచ్చు. విశ్రాంతి తీసుకోండి. ఈరోజు మీకు సమయం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు.

వృచ్ఛిక రాశి 30 మార్చి 2020

వేర్వేరు కారణాలతో మీకు రాకుండా ఆగిపోయిన పాత డబ్బు, మొండి బాకీలు ఇవాళ మీకు తిరిగి రావొచ్చు. అధికారులు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఏవైనా కొత్త బాధ్యతలు కూడా పొందే అవకాశాలున్నాయి. సీనియర్ల నుండి మద్దతు ఉంటుంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీ డబ్బు పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు కొన్ని మంచి అవకాశాలను పొందవచ్చు. రోజువారీ కార్యకలాపాలు డబ్బుకు ప్రయోజనం చేకూరుస్తాయి. మీ భాగస్వామి మీ నుండి ప్రయోజనం పొందవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

ధనుస్సు రాశి 30 మార్చి 2020

జూనియర్ల నుండి సహాయం, ప్రయోజనం పొందవచ్చు. వ్యాపారంలో కొత్త పథకాల ప్రారంభానికి కలిసొస్తుంది. జూనియర్, సీనియర్ అందరూ మీకు సహాయం చేస్తారు. మీరు ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంటే మీరు విజయవంతం కావచ్చు. గతంలో మీరు ఇతరులకు చేసిన సహాయం ఇవాళ మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజు మీరు ప్రేమించిన వారే మీ మనసు నొప్పించే అవకాశాలున్నాయి. భాగస్వామిని సంతోషపెట్టడానికి కొంత ఖర్చులపాలవుతారు.

మకర రాశి 30 మార్చి 2020

ఏదైనా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. మీరు కొన్ని కొత్త అవకాశాలను కూడా పొందవచ్చు. ఆకస్మికంగా సంపద కలిసొచ్చే అవకాశాలున్నాయి. అయితే, అలాగని కష్టపడటం మానొద్దు. ఎందుకంటే మన పెద్దలు కష్టే ఫలి అని అన్నారు. మీ రచనలు, సాహిత్యానికి తగిన గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఆరోగ్యం విషయంలో కూడా ఈ రోజు బాగుంది.

కుంభ రాశి 30 మార్చి 2020

ఉద్యోగంలో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు సీనియర్ల నుండి సహాయం పొందవచ్చు. కొత్త అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఇవాళ పరిస్థితులు కలిసొచ్చే అవకాశం ఉంది. పాత స్నేహితులు ఉద్యోగం కోసం మీకు సహాయం చేయవచ్చు. మనస్సు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో పనితీరు మునుపటి కంటే మెరుగ్గా ఉండవచ్చు. ఈరోజు వినోదానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి.

మీన రాశి 30 మార్చి 2020

మీ పనితీరులో లేదా వాటిని చేసే మార్గాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో మనస్సు లగ్నమవదు. ఫలితంగా పని తగ్గుతుంది, గందరగోళం పెరుగుతుంది. ప్రేయసి, ప్రియుడితో వ్యక్తిగత విషయాలపై వాగ్వీవాదం జరగొచ్చు. మీరు మీ బాధ్యతల సరిగ్గా నిర్వర్తిస్తున్నారా లేదా అనే విషయమై మీకు ఎదుటివారి నుండి సవాళ్లు ఎదురవవచ్చు. కొన్నిసార్లు అవి వాగ్వీవాదానికి కూడా దారితీయొచ్చు. కొంతమంది మీ కృషికి వాళ్లు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ పరిస్థితిని అందరికీ స్పష్టం చేయకుండా ఉండడం మీకే మంచిదని మీ జాతకం సూచిస్తోంది.

Trending News