viral news: చైనీస్ వ్యక్తి 'స్పైసీ ఫ్రాగ్ చిల్లీ' ఆర్డర్ చేశాడు.. తినబోతుండగా షాక్ తిన్నాడు!

Viral news: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి  ఫ్రాగ్ చిల్లీని ఆర్డర్ చేశాడు. అతడికి ఆ వంటకాన్ని తీసుకొచ్చి వడ్డించారు. అతడు తినబోతుండగా ఓ ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అది ఏంటంటే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 15, 2022, 04:42 PM IST
viral news: చైనీస్ వ్యక్తి  'స్పైసీ ఫ్రాగ్ చిల్లీ' ఆర్డర్ చేశాడు.. తినబోతుండగా షాక్ తిన్నాడు!

Viral news: ప్రపంచవ్యాప్తంగా వింత వంటకాలను తయారుచేయడంలో, తినడంలో చైనీయుల తర్వాతే ఎవరైనా.  వీరు కుక్కలు, పిల్లుల నుంచి గబ్బిలాలు, కోతుల వరకు రకరకాల జంతువుల మాంసాలు తింటారు. అంతేకాకుండా మొసళ్లు, పాములు, తేళ్లు వంటి వాటి మాంసాన్ని కూడా మార్కెట్లలో విక్రయిస్తారు. 

డైలీ స్టార్ నివేదిక ప్రకారం, చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి  స్పైసీ ఫ్రాగ్ చిల్లీని (Spicy Frog Chilli) ఆర్డర్ చేశాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ వ్యక్తికి స్పైసీ ఫ్రాగ్ చిల్లీని వడ్డించగా... కప్ప ప్లేట్‌లోంచి బయటకు దూకింది. చెంగ్డూ నగరంలో ఉన్న ఓ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి ఈ రెస్టారెంట్‌కి సాధారణ కస్టమర్ అని అక్కడి వారు చెబుతున్నారు. 

ఈ రెస్టారెంట్ యొక్క ప్రసిద్ధ వంటకం 'బుల్ డాగ్ ఫ్రాగ్ చిలీ'. ఈ వంటకాన్ని (bulldog frog chilli) తయారుచేసేటప్పుడు.. ముందుగా కప్ప యొక్క తల కత్తిరిస్తారు. దీని తరువాత దానికి ఎర్ర మిరపకాయ, నల్ల మిరియాలులో మెరినేట్ చేస్తారు. మసాలా దినుసులు యాడ్ చేసి ఈ వంటకాన్ని రెడీ చేస్తారు. మొన్నటిదాకా అంతా బాగానే ఉంది కానీ ఆ వ్యక్తికి బుల్ డాగ్ మిరపకాయ వడ్డించగా.. చెంచాతో తినబోయాడు. అప్పుడు హఠాత్తుగా తల నరికిన కప్ప ప్లేట్‌లోంచి దూకి టేబుల్‌పైకి దూకింది. ఈ వీడియో చైనా సోషల్ మీడియా డోయిన్‌లో షేర్ చేయబడింది. వీడియోలో, కప్ప కాళ్ళు మరియు చేతులు కదులుతున్నట్లు కనిపిస్తుంది. చాలా మంది ఈ వంటకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో, చాలా మంది వంటకం చూసి అసహ్యించుకున్నారు. చాలా మంది ఈ వంటకాన్ని 'జోంబీ కప్ప' (Zombie Frog) అని పిలుస్తారు. 

Also Read: Nude Thief Caught On Camera: వీడో వెరైటీ దొంగ.. బట్టలిప్పి నగదు చోరీ.. సీసీ కెమెరా దృశ్యాలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News