Trending Video: బైక్‌పై యువతి ఓవర్ యాక్షన్ చేస్తూ స్టంట్లు.. జంటను ఢీకొట్టి పరార్.. వీడియో వైరల్

Girl Bike Rash Driving Video: కొంతమంది చేసే ఓవరాక్షన్‌ వల్ల ఇతరులు ఇబ్బందుల పాలవుతుంటారు. ఓ యువతి బైక్‌పై చేసిన స్టంట్లలో ఓ జంట గాయాలపాలయ్యారు. బైక్‌పై స్టంట్లు రోడ్డుపై అటు ఇటు ఊగుతూ వెళుతుండగా.. వెనుక నుంచి యువతి బైక్‌ను ఢీకొట్టి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2023, 10:20 PM IST
Trending Video: బైక్‌పై యువతి ఓవర్ యాక్షన్ చేస్తూ స్టంట్లు.. జంటను ఢీకొట్టి పరార్.. వీడియో వైరల్

Girl Bike Rash Driving Video: సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు రోడ్డుపై వికృతంగా డ్రైవింగ్ చేస్తున్న వీడియోలు ఇటీవల నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ.. రోడ్డుపై విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు సృష్టిస్తుంటారు. ఈ విషయంలో అబ్బాయిలకు తక్కువేమి కాదన్నట్లు అమ్మాయిలు కూడా ఇష్టానుసారం బైక్‌లు నడుపుతున్నారు. తాజాగా ఓ అమ్మాయి బైక్‌పై వేగంగా వెళుతూ విన్యాసాలు చేసుకుంటూ వెళుతూ ఓ జంటను కిందపడేసింది.  

వైరల్‌గా అవుతున్న ఈ థ్రిల్లింగ్ వీడియోలో ఓ అమ్మాయి రోడ్డు మధ్యలో బైక్‌ని అటు ఇటు ఊపుతూ చాలా వేగంగా వెళుతోంది. బైక్ స్పీడ్ చాలా వేగంగా ఉండడంతో చూసి వెనుక నుంచి ఓ వ్యక్తి వీడియో తీశాడు. మొదట్లో ఈ వీడియో చూసి కాసేపు నవ్వు వచ్చినా.. తరువాత ఏమైందో చూస్తే మీకు కచ్చితంగా కోపం వస్తుంది. ఆ వీడియోను మీరు చూసేయండి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Satish Kumar 💗 (@mcqueen_spee_d)

ఈ అమ్మాయి ఎలా బైక్ నడుపుతుందో చూశారా..  బైక్ వెళుతున్న జంట ముందుకు అడ్డుగా రావడంతో వాళ్లు ఆ యువతి బైక్‌ను ఢీకొని కిందపడిపోయారు. ఈ అమ్మాయి చేసిన తప్పుకు వాళ్లు గాయాలపాలయ్యారు. వీడియో చూస్తే అతడికి ఎన్ని దెబ్బలు తగిలాయో ఊహించవచ్చు. ఇంత జరిగినా.. ఆ జంట కిందపడిపోవడం చూసి ఆ యువతి అలానే ముందుకు వెళ్లిపోయింది. 

ఈ బైక్ స్టంట్ వీడియో mcqueen_spee_d పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 50 వేల మందికి పైగా లైక్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు బైక్ రైడర్ అమ్మాయి డ్రైవింగ్ స్కిల్స్‌పై మండిపడుతున్నారు. అమ్మాయిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. "ఇలాంటి స్టంట్స్ వల్ల వాళ్లు ఇబ్బంది పడటమే కాకుండా.. ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ అమ్మాయిపై కేసు నమోదు చేయాలి. అప్పుడే ఇలాంటి వాళ్లకు బుద్ధి వస్తుంది" అంటూ రాసుకొస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

Also Read: PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. నగదు ఎప్పుడు జమకానుందంటే..?  

Also Read: Rs 10 Note: ఈ 10 రూపాయల నోటు ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు.. ఎలాగంటే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News