PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. నగదు ఎప్పుడు జమకానుందంటే..?

PM Kisan Samman Nidhi Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడుత నగదు కోసం దేశంలో కోట్లాదిమంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి అప్‌డేట్ వచ్చింది. రైతుల ఖాతాలో నగదు జమ అయ్యే తేదీపై దాదాపు క్లారిటీ వచ్చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2023, 07:00 PM IST
PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. నగదు ఎప్పుడు జమకానుందంటే..?

PM Kisan Samman Nidhi Scheme: దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త. పీఎం కిసాన్ స్కీమ్ కింద 13వ విడత నిధులు రిలీజ్‌పై బిగ్‌ అప్‌డేట్ వచ్చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా సమాచారం ఇచ్చింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 11.37 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు నమోదు చేసుకున్నారని అగ్రికల్చర్ ఇండియా ట్వీట్ చేసింది.
ఈ పథకం కింద లబ్ధిదారులకు సంవత్సరానికి రూ.6 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు రాసుకొచ్చింది.

హోలీకి ముందే పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు ప్రధాని మోదీ 13వ విడత రూ.2 వేల నగదు అకౌంట్లలో జమ చేస్తారని ప్రచారం జరుగుతోంది. హోలీకి ముందే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తే.. సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అయితే ఈ-కేవైసీ చేయనివారి ఖాతాలకు డబ్బు బదిలీ చేయట్లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది.

రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు 2019లో  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.  ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.6 వేల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం సుమారు 11 కోట్ల మంది రైతులకు రూ.2.2 లక్షల కోట్ల మొత్తం నగదు బదిలీ చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తెలిపారు. ఇప్పటివరకు 12 విడుతలుగా నగదు జమ చేసింది. ప్రస్తుతం 13వ విడుత కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. 

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఇలా చెక్ చేసుకోండి..

>> పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.inకి వెళ్లండి .
>> ఇప్పుడు ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయండి.
>> బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
>> డ్రాప్-డౌన్ మెను నుంచి రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, గ్రామాన్ని ఎంచుకోండి.
>> 'గెట్ రిపోర్ట్' ఎంచుకోండి.  
>> ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
>> దీని తర్వాత మీరు మీ స్థితి గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు.

ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నెంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు సంప్రదించాలి. అది కాకుండా pmkisan-ict@gov.in కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.

Also Read: Railway Track Stolen: వింత దొంగతనం.. 2 కిలోమీటర్ల రైలు పట్టాలు ఎత్తుకెళ్లిన దొంగలు   

Also Read: ప్రధాని మోదీ అండతోనే అదానీకి అపార సంపద.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి: ఎమ్మెల్సీ కవిత   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News