Broken Mirror: ఇంట్లో పగిలిన అద్దం వాడుతున్నారా? వెంటనే మార్చేయండి, లేకపోతే అనర్ధాలే

Broken Mirror: జ్యోతిష్యశాస్త్రంలో మనకు తెలియని చాలా విషయాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఇంట్లోని కొన్ని వస్తువులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది కాదనే వివరాలున్నాయి. ముఖ్యంగా పగిలిన అద్దం ఇంట్లో అస్సలు మంచిది కాదంట..ఆ వివరాలు పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2022, 11:49 PM IST
Broken Mirror: ఇంట్లో పగిలిన అద్దం వాడుతున్నారా?  వెంటనే మార్చేయండి, లేకపోతే అనర్ధాలే

Broken Mirror: జ్యోతిష్యశాస్త్రంలో మనకు తెలియని చాలా విషయాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఇంట్లోని కొన్ని వస్తువులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది కాదనే వివరాలున్నాయి. ముఖ్యంగా పగిలిన అద్దం ఇంట్లో అస్సలు మంచిది కాదంట..ఆ వివరాలు పరిశీలిద్దాం..

తెలిసో తెలియకో కొన్ని విషయాల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది అస్సలు మంచిది కాదు. చాలామంది ఇళ్లలో రోజూ చూసుకునే అద్దం ఎక్కడో చోట పగిలి ఉంటుంది. ఆ అద్దాన్ని తొలగించకుండా అలాగే వాడుతుంటారు. ఒకవేళ వాడకపోయినా అలాగే ఉంచేస్తుంటారు. అదే విధంగా వుడ్ షెల్ఫ్ విరిగినా లేదా షెల్ఫ్‌పై చెద పట్టినా పెద్దగా పట్టించుకోం. ఈ రెండు అంశాల్ని పట్టించుకోకపోవడం అప శకునంగా భావిస్తారు. పగిలిన అద్దం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఏ విధంగా హానికారకమౌతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా శకునం, ముహూర్తంపై చాలామంది పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు గానీ..ఈ రెండూ చాలా కీలకం. చాలా మంది ఇళ్లలో కిటికీ అద్దాలు పగిలి ఉంటాయి. లేదా స్నానానంతరం చూసుకునే అద్దం ఎక్కడో చోట బీటలు వారి ఉండటం సహజమే. అయితే చిన్నదే కదా అని పెద్దగా పట్టించుకోం. అలానే వాడేస్తుంటాం. మీరు కూడా అలానే చేస్తుంటే..మీ ఇంట్లో పగిలిన అద్దమున్నా..చిన్నగా బీటలు వారిన అద్దాన్ని వాడుతున్నా..మీ ఇంట్లో ఏదైనా రోగం లేదా పెద్దరోగాలు పొంచి ఉన్నాయని అర్దం చేసుకోండి. ఇలా ఉంటే నెలరోజుల్లోనే ఏదో ఒక రోగం అంటుకుని..పెద్దఎత్తున డబ్బులు ఖర్చయిపోతాయి.

ప్రస్తుతం మొబైల్ ఫోన్ అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో ఇదొక అత్యవసర వస్తువుగా ఉంటోంది. చాలా సందర్భాల్లో మొబైల్ ఫోన్ కింద స్క్రీన్ లేదా టెంపర్డ్ గ్లాస్ పగిలి పోతుంటుంది. మొబైల్ పనిచేస్తుంటే మాత్రం స్క్రీన్ లేదా టెంపర్ గ్లాస్ మార్చకుండా అలానే వినియోగిస్తుంటాం. దీనివల్ల మీ మానసిక సమతుల్యతపై ప్రభావం పడుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. నెగెటివిటీ పెరుగుతుందట. అదే విధంగా మీరు వినియోగించే కారు లేదా బైక్ అద్దం పగిలున్నా సరే..అలా వదిలేయకూడదు. వెంటనే మార్చేయాలి. పగిలిన అద్దం అశుభ సూచకంగా భావిస్తారు. 

చాలా సందర్భాల్లో ఇంట్లో వుడ్‌తో చేసిన వస్తువులు పాడవుతుంటాయి. చెద పట్టేసుంటాయి. కలపతో చేసిన వస్తువులు చెద పడితే వెంటనే చెద మందుతో ఆ సమస్యను దూరం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇది ఇంటి యజమానిని నెమ్మది నెమ్మదిగా ఒత్తిడికి గురి చేస్తుంది. ఇదే చెద మరింతగా విస్తరిస్తే ఇంట్లో సమస్యలు అధికమౌతాయి. పిల్లల పనులు జరగవు. లేదా ఆగిపోతుంటాయి.

Also read: Mars Transit 2022: మంగళ గ్రహం మేషరాశి ప్రవేశం, జూన్ 27 నుంచి ఏయే రాశులకు ఎలా ఉండబోతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News