Directions and Idols: ఇంట్లో దేవతల విగ్రహాల్ని ఏ దిశలో ఉంచాలి, వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది

Directions and Idols: ఇంట్లో సుఖ శాంతులు వర్ధిల్లేందుకు దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్టిస్తుంటాం. కానీ ఈ విగ్రహాల్ని వాస్తు నిబంధనల ప్రకారం అమర్చకపోతే ఏమౌతుంది, వాస్తు పాటిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2022, 11:55 PM IST
Directions and Idols: ఇంట్లో దేవతల విగ్రహాల్ని ఏ దిశలో ఉంచాలి, వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది

Directions and Idols: ఇంట్లో సుఖ శాంతులు వర్ధిల్లేందుకు దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్టిస్తుంటాం. కానీ ఈ విగ్రహాల్ని వాస్తు నిబంధనల ప్రకారం అమర్చకపోతే ఏమౌతుంది, వాస్తు పాటిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

హిందూమతంలో దేవుడి పూజకై చాలామంది ఇంట్లోనే మందిరం సిద్ధం చేసుకుంటారు. ఆ మందిరంలో దేవుళ్ల విగ్రహాలు నిండుగా అమర్చుకుంటారు. ఇంట్లో ఉంచిన ఈ విగ్రహాలతో సుఖ శాంతులు వర్ధిల్లుతాయని ప్రతీతి. కానీ వాస్తు పండితుల ప్రకారం మందిరంలో విగ్రహాలు సరైన దిశలో అమర్చాల్సి ఉంటుంది. అప్పుడే ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో తప్పుడు దిశలో విగ్రహాలు ఉంచితే నెగెటివ్ ఎనర్జీ ప్రసారమౌతుందని వాస్తుశాస్త్రం సూచిస్తోంది. దాంతోపాటు దేవుళ్ల పూజ కూడా అసంపూర్తిగా మిగిలిపోతుంది. అందుకే ఇంట్లో మందిరంలో ఏ దేవుడి లేదా దేవత విగ్రహముంచినా..నిర్ధారిత దిశలోనే ఉంచాలి. లక్ష్మీదేవి, గణేశుని విగ్రహాల్ని ఏ దిశలో ఉంచితే మంచిదో చూద్దాం..

హిందూమతంలో ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు గణేషునికి పూజ చేస్తారు. ఆ గణేశుని విగ్రహం ఇంట్లో సరైన దిశలో ఉంటేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి విరాజిల్లుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం గణేశుని విగ్రహాన్ని ఇంట్లో ఉత్తర దిశలో అమర్చడం శుభంగా భావిస్తారు. గణేశుని సింధూర చిత్రమైతే మంచి ఫలితాలుంటాయని చెబుతారు. ఇక లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఇంట్లో చాలామంది అమర్చుకుంటారు. కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని సైతం సరైన దిశలో అమర్చుకోవాలి. ఇంటి మందిరంలో ఉంచే లక్ష్మీదేవి విగ్రహాన్ని గణేశునికి కుడివైపున పెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవి గణేశుని తల్లి. అందుకే లక్ష్మీదేవి విగ్రహాన్ని గణేశునికి కుడివైపున పెట్టాలి. 

కొంతమంది ఇంట్లో చిన్న శివలింగాలు కూడా ఉంచుకుని పూజలు చేస్తారు. ఈ పరిస్థితుల్లో శివలింగాన్ని కూడా సరైన దిశలో ఉంచడం అవసరం. ఇంట్లో శివలింగాన్ని ఉత్తరదిశలోనే ఉంచాలి. ఫలితంగా ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసారమౌతుంది. వాస్తు పండితుల సూచనల ప్రకారమే ఇంట్లో దేవతల విగ్రహాలు పెట్టాల్సి ఉంటుంది. లేకుంటే అరిష్టమేనట.

Also read: Chanakya Niti: చాణక్యనీతి ప్రకారం ఈ 4 విషయాలు ఎప్పుడూ మీ భార్యకు చెప్పకండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News