Ramlalla Idol Colour: అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహం నలుపు రంగులో ఎందుకుంది

Ramlalla Idol Colour: అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి మరి కొద్ది గంటల వ్యవధి మిగిలుంది. ఇప్పటికే గర్భగుడికి చేరిన బాల రాముడి విగ్రహానికి రేపు ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అయితే రాముడి విగ్రహం నల్లరంగులో ఎందుకుందనే సందేహం అందరిలో ఉంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 21, 2024, 11:17 AM IST
Ramlalla Idol Colour: అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహం నలుపు రంగులో ఎందుకుంది

Ramlalla Idol Colour: జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. జనవరి 23 నుంచి సాధారణ భక్తుల దర్శనం ఉంటుంది. ఇప్పటికే రామాలయంలో ప్రతిష్టిస్తున్న రాముడి విగ్రహం ఎలా ఉందో అందరికీ తెలిసింది. అందుకే ఓ ప్రశ్న ఉత్పన్నమౌతోంది. రామ్‌లల్లా విగ్రహం నలుపు లేదా ఛామన ఛాయలో ఎందుకుంది..

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ కొనసాగుతోంది. 2019లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రామమందిరం నిర్మాణం ప్రారంభమైంది. రేపు అంటే మరో 24 గంటల్లో రామాలయం ప్రారంభోత్సవం జరగనుంది. రామమందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దాదాపు వారం రోజుల్నించి వివిధ రకాల పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 22వ తేదీ మద్యాహ్నం 12.20 గంటల నుచి 84 సెకన్ల దివ్యమైన ముహూర్తంలో నల్లని శిలపై చెక్కిన బాలరాముడి ప్రతిమకు ప్రాణం పోస్తారు. ఇదే ప్రాణ ప్రతిష్ఠ. ఇప్పటికే బాలరాముడి విగ్రహం ఎలా ఉందో అందరూ చూసే ఉంటారు. మొత్తం మూడు విగ్రహాలు తయారు చేయగా మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారుచేసిన విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టకు ఎంపిక చేశారు. ఈ మూడు విగ్రహాల్లో రెండు నలుపు లేదా ఛామనఛాయలో ఉంటే ఒకటి మాత్రం తెలుపు రంగులో ఉంది. రాముడి విగ్రహాన్ని నలుపు రంగులో ఎందుకనేదే ఇప్పుడు సామాన్య భక్తులకు వస్తున్న ప్రశ్న.

నలుపు లేదా ఛామనఛాయలో విగ్రహం ఎందుకుంది.

రామమందిరంలో గర్భగుడిలో ఐదేళ్ల ప్రాయంలోని రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. రేపు మద్యాహ్నం ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. రాముడి విగ్రహానికి ఎంచుకున్న శిల చాలా ప్రత్యేకమైంది. ఈ శిల చాలా విశిష్టమైంది. రాముడి విగ్రహంపై పాలు లేదా ఇతర పదార్ధాలతో అభిషేకాలు జరిగినప్పుడు ఈ శిల కారణంగా ఏలాంటి దుష్ప్రభావం పడదు. అంటే విగ్రహం పాడవదు. అంతేకాకుండా ఈ శిల అయితే వేయి సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉంటుంది. అంటే ఎన్ని ఏళ్లైనా విగ్రహంలో ఎలాంటి మార్పు ఉండదు. దాంతోపాటు వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణన చేసేటప్పుడు ఛామనఛాయలో అందమైన, కోమలమైన, ఆకర్షణీయమైన రూపంగా ఉంది. అందుకే రాముడి విగ్రహాన్ని ఛామనఛాయలో ఎంచుకున్నారు. 

రామమందిరంలో ప్రతిష్ఠిస్తున్న బాలరాముడి విగ్రహం ఎత్తు కేవలం 51 అంగుళాలు. ఐదేళ్ల ప్రాయంలోని రాముడి ప్రతిమ అయినందున అంతే ఎత్తు పెట్టారు. చిరునవ్వులు చిందిస్తున్న బాలరాముడి రూపంలో ఉంటుంది. 

Also read: Multibagger Stocks: లక్ష రూపాయల పెట్టుబడిని 10 నెలల్లో 15 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News