Bada Mangal 2023: జ్యేష్ఠ మాసంలోని మంగళవారానికి చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. దీనినే బడా మంగళ్ లేదా బుద్వా మంగళ్ అని కూడా అంటారు. ఈరోజున హనుమంతుడిని పూజించడం వల్ల మనిషి జీవితంలోని దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. బడా మంగళ్ నాడు మీరు తీసుకునే కొన్ని చర్యలు మీకు దేనికీ లోటు లేకుండా చేస్తుంది.
బడా మంగళవారం నాడు ఈ చర్యలు చేయండి..
1. మీరు ఉద్యోగంలో పదే పదే వైఫల్యాలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు మంగళవారం నాడు హనుమంతుడిని పూజించండి. అంతేకాకుండా ఆంజనేయుడి గుడికి వెళ్లి నూనెతో దీపం వెలిగించండి. ఈరోజున బజరంగ బలికి తమలపాకులు సమర్పించడం వల్ల మీరు జాబ్ లో పురోగతి సాధిస్తారు.
2. మంగళవారం నాడు హనుమంతుడికి చోళాన్ని సమర్పించడం వల్ల ఆ దేవుడి సంతోషించి.. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిసేలా చేస్తుంది. మీరు శనివారం కూడా ఈ పరిహారం చేయవచ్చు.
3. మంగళవారం తెల్లవారుజామున స్నానం చేసి హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా 21 రోజులు నిరంతరం చేస్తే శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది.
4. మంగళవారం నాడు పాత్రతో నీటిని తీసుకుని హనుమాన్ విగ్రహం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. 21 మంగళవారాలు ఇలాగే కంటిన్యూ చేస్తే.. మీరు అన్ని వ్యాధుల నుండి బయటపడతారు.
5. ప్రతి మంగళవారం నాడు 7 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు హనుమంతుడికి బూందీ సమర్పించండి. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
Also Read: Sun transit 2023: మే 15 నుండి ఈరాశుల అదృష్టం సూర్యుడిలా ప్రకాశించనుంది.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook