Diwali 2022: ఎంతో ప్రాముఖ్యమైన పండుగలలో దీపావళి పండగ ఒకటి. దీపావళి పండుగను పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా ఐదు రకాల పండగలను జరుపుకుంటారు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో ధనవంతురి పూజా కార్యక్రమం, ధన త్రయోదశి, నరక చతుర్థి, మహాలక్ష్మి పూజ, గోవర్ధన పూజ, బాయిదూజ్ పండగలు జరుపుకుంటారు. ఇక ఈ సంవత్సరం దీపావళి పండగ అక్టోబర్ 24 న రాబోతుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఇంట్లోనే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని బ్రహ్మపురాణం చెబుతోంది.
కాబట్టి హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ఈ పూజా క్రమంలో ముందుగా గణేశుని పూజించడం ఆనవాయితీ. గణేశుడు పూజ వల్ల లక్ష్మీదేవి పూజ ప్రారంభమవుతుంది. అయితే ఈ గణేశుడు పూజ హిందూ పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది అదేంటో తెలుసుకుందాం.
సనాతన ధర్మంలో గణపతిని అన్ని పూజల్లో భాగంగా మొదటగా ఆరాధించేవారు. అయితే దీపావళి రోజున కూడా లక్ష్మీదేవి పూజలో భాగంగా వినాయకుని పూజ తప్పనిసరిగా చేయాలని పురాణాలు చెబుతున్నారు. లేకపోతే పూజ అసంపూర్ణంగానే పూర్తవుతుందని సనాతన ధర్మంలో పలు శాస్త్రాలు చెబుతున్నాయి.
దీపావళి రోజున లక్ష్మీదేవి పూజలో భాగంగా గణేశుడి భోజనం ఎందుకు చేయాలో తెలుసా.?
విష్ణువు, లక్ష్మీదేవిలు భక్తులకు సకల సంతోషాలతో పాటు సంపద నాన్ని కలగజేస్తారు. చాలామందిలో సంపద ధనం ఉన్నప్పటికీ వారు చేసే కార్యక్రమాలు నిర్విఘ్నాలు ఎదురవుతున్నాయి. ఈ నిర్విఘ్నాలను తొలగించేందుకు తప్పకుండా దీపావళి రోజున లక్ష్మీదేవి పూజతో పాటు వినాయకుని పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం తో పాటు వినాయకుని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరిసంపదలు కలిగి నిర్విఘ్నాలు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నారు.
Also Read : Ori Devuda Vs Ginna : విశ్వక్ సేన్‌ను కూడా దాటని మంచు విష్ణు
Also Read : Actress Anjali Pavan : అమ్మ మాత్రమే.. నాన్న లేరు.. స్టేజ్ మీద ఏడిపించేసిన మొగలిరేకులు అంజలి పవన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook