Garuda Purana Learnings: పురాణాల్లో గరుడ పురణానికి ప్రత్యేక స్థానముంది. ఇందులో జీవన్మరణమే కాకుండా సంతోషకరమైన-విజయవంతమైన జీవితాన్ని పొందే మార్గాలు కూడా చెప్పబడ్డాయి. దీంతో పాటు కొన్ని చెడు అలవాట్లు లేదా చెయ్యకూడని పనులు చెప్పబడ్డాయి. ఈ తప్పులు చేయడం వల్ల మీరు పేదవారిగా మారిపోతారు. అంతేకాకుండా మీ జీవితంలో సంతోషం అనేది ఉండదని ఈ పురాణం (Garuda Purana) చెబుతోంది.
ఈ తప్పులు చేయకండి
మురికి బట్టలు ధరించడం: గరుడ పురాణం ప్రకారం, లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా జీవించే వారిని మాత్రమే అనుగ్రహిస్తుంది. అందుకే బట్టలు మరియు గోర్లు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ స్నానం చేయండి. మురికిగా మాత్రం ఉండకండి.
వంటగది శుభ్రంగా ఉంచుకోకపోవడం: రాత్రిపూట వంటగదిని మురికిగా ఉంచడం, తిన్న పాత్రలను కడగకుండా ఉండటం వంటి చర్యలు వల్ల తల్లి అన్నపూర్ణ మరియు తల్లి లక్ష్మికి కోపం వస్తుంది. అలాంటి ఇంట్లోని వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఎప్పుడూ నిద్రించే ముందు వంటగదిని శుభ్రం చేయండి.
ఎక్కువ సేపు నిద్రపోవడం: ఎక్కువ సేపు నిద్రించే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఈ వ్యక్తులు జీవితంలో పురోగతి సాధించలేరు లేదా వారి కలలను నెరవేర్చుకోలేరు. వారి కష్టానికి తగిన ఫలాలు పూర్తిగా లభించడం లేదు.
నిస్సహాయులను బలవంతంగా దోచుకోవడం: నిస్సహాయులను దోపిడి చేసి లేదా మోసం చేసి ధనవంతులు అయిన వ్యక్తులు కొంతకాలం బాగున్నా..తర్వాత వారు ప్రతిదీ కోల్పోతారు. కాబట్టి ఇలాంటి పనులకు దూరంగా ఉండండి.
స్త్రీలను, వృద్ధులను అవమానించడం: స్త్రీలను, వృద్ధులను అవమానించే వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. వారి సంపద మరియు ప్రతిష్ట పోతుంది.
Also Read: Planet Transit June 2022: జూన్ నెలలో బుధుడు, శనిల కదలిక... 4 రాశులవారికి డబ్బులు గల గల!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook