జ్యోతిష్యం ప్రకారం గ్రహణానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇదొక పెద్ద ఖగోళ ఘటన. ప్రపంచం మొత్తం గ్రహణంపై దృష్టి పెడుతుంటుంది. ఎందుకంటే గ్రహణ సందర్భంగా మారే గ్రహాల స్థితి..జీవితంపై ప్రభావం చూపిస్తుందనేది జ్యోతిష్యం చెప్పే మాట.
అందుకే గ్రహణం సందర్భంగా జ్యోతిష్య పండితులు జాగ్రత్తలు సూచిస్తుంటారు. కొత్త ఏడాది ప్రారంభమైంది. మరి ఈ ఏడాదిలో తొలి గ్రహణం ఎప్పుడుంటుంది. ఇండియాలో ఈ గ్రహణం కన్పిస్తుందా లేదా, 2023లో తొలి సూర్య గ్రహణం, తొలి చంద్ర గ్రహణం ఎప్పుడున్నాయనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. గ్రహణం అనేది ఓ సాధారణమైన ఖగోళ ఘటన. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడి వెలుగు భూమిపై ప్రసరించదు. దీనిని సూర్య గ్రహణంగా పిలుస్తారు. అదే భూమి..చంద్రుడికి, సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు చంద్రుడిపై భూమి నీడ పడుతుంది. ఇదే చంద్ర గ్రహణం.
ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం
2023లో రెండు సూర్య గ్రహణాలున్నాయి. రెండు చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాదిలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడనుంది. ఉదయం 7 గంటల 4 నిమిషాలకు ప్రారంభమై..మద్యాహ్నం 12 గంటలు 29 నిమిషాల వరకూ ఉంటుంది. అయితే ఈ సూర్య గ్రహణం ఇండియాలో కన్పించదు. అందుకే ఇండియాలో సూర్య గ్రహణం సందర్భంగా ఏర్పడే సూతక కాలం ఉండదు.
ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం
జ్యోతిష్యం ప్రకారం 2023లో తొలి చంద్ర గ్రహణం మే 5, 2023న ఏర్పడుతుంది. చంద్ర గ్రహణం మే 5వ తేదీ రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ప్రారంభం కానుంది. రాత్రి 1 గంట వరకూ ఉంటుంది. చంద్ర గ్రహణం ఇండియాలో చాలా ప్రాంతాల్లో కన్పించనుంది. అందుకే చంద్ర గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందే సూతక కాలం ప్రారంభమౌతుంది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం కావడం మరో విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook