Guru Gochar 2023 Upay: గురు గ్రహం ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ చర్యలు చేయండి..

Jupiter transit 2023: రీసెంట్ గా దేవగురు బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా రాహువుతో కలిసి అశుభకరమైన యోగాన్ని ఏర్పరిచాడు. గురుడు యెుక్క ఈ ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2023, 12:58 PM IST
Guru Gochar 2023 Upay: గురు గ్రహం ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ చర్యలు చేయండి..

Guru Gochar 2023 Upay: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవతల గురువుగా భావిస్తారు. గురుడు నిన్న అంటే ఏప్రిల్ 22, తెల్లవారుజామున 3:33 గంటలకు తన సొంత రాశి అయిన మీన రాశిని విడిచిపెట్టి మేష రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. వీరిద్దరి కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్యంలో ఈ యోగాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. దీని వల్ల కొన్ని రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు. బృహస్పతి సంచారం మీకు అశుభం అయితే.. ఖచ్చితంగా ఈ చర్యలు చేయండి. 

ఈ పరిహారాలు చేయండి..
** ప్రతి రోజూ ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీటిని తీసుకుని సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
** ఉదయం మరియు సాయంత్రం గురు మంత్రాన్ని జపించడం వల్ల మీ జాతకంలో బృహస్పతి బలపడతాడు. 
** ప్రతి గురువారం ఏదైనా మందిరం లేదా మసీదు లేదా చర్చను సందర్శించడం మంచిది. 
** తెల్లని బట్టలు ధరించడం వల్ల బృహస్పతి ప్రతికూల ప్రభావం మిమ్మల్ని బాధించదు.
** ఏప్రిల్ నుండి అక్టోబరు వరకు బృహస్పతి మార్పు ప్రతికూలంగా మరియు సమస్యాత్మకంగా ఉంటుంది. అయితే అక్టోబర్ నుండి వచ్చే ఏడాది మే వరకు ఈ మార్పు మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండాప్రజల జీవిత కష్టాలను తొలగిస్తుంది.

Also Read: Jupiter Transit: 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి సంచారం, పెద్ద మొత్తంలో డబ్బు మీ సొంతం! 

Also Read: Budh Asta 2023: చాలా రోజుల తర్వాత మూడు గ్రహాలు ఒకే రాశిలోకి.. ఈ రాశులవారికి ముట్టింది బంగారమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News