Diwali Horoscope Rashifal Future Predictions: ఈ సంవత్సరం దీపావళి పండగ నవంబర్ 10 తేదిన వస్తోంది. మహాలక్ష్మి పూజలు చేయాలనుకునేవారు నవంబర్ 12న శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ఈ ఏడాది దీపావళి ముందు రోజుల నుంచే కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఇదే సమయంలో రాహు, కేతు, శని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ఈ గ్రహాల సంచారం కారణంగా ఏయే రాశులవారి జీవితాలు శుభప్రదంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రభావం:
మేషరాశి:
దీపావళి పండగకు ముందు మేషరాశి వారు అకస్మాత్తుగా కుటుంబం నుంచి శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించి..ఊహించని లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.
మిథునరాశి:
మిథునరాశి వారికి పండగకు ముందు నుంచే శుభ సమయాలు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా గౌరవం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇంట్లో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ రాశివారికి ఉద్యోగ పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
సింహరాశి:
ఈ సమయంలో సింహ రాశివారకి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ఆఫీసులు మరే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా ఈ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి.
కన్యారాశి:
దీపావళి పండగకు ముందు కన్యారాశి వారి ఉద్యోగాలలో ప్రమోషన్స్ కూడా పొందుతారు. అంతేకాకుండా కొత్త ప్రాజెక్ట్స్ అమోదం పొందుతారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉండడం వల్ల ట్రిప్స్‌కి వెళ్లే ఛాన్స్‌లు కూడా వస్తాయి. సమాజంలో గౌరవంతో పాటు కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook