Horoscope Today 15 September 2022: మేషం ( Aries): కష్టపడితే ఫలితాలు ఉన్నాయి. కుటుంబసభ్యులతో శుభకార్యం గురించి మాట్లాడతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయండి. ప్రయాణాలు చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
వృషభం (Taurus): అన్ని రంగాల వారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం ఉంది. నచ్చిన వారితో సంతోషంగా గడుపుతారు. శుభ వార్తలు వింటారు. విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుర్గ స్తోత్రం పఠించాలి.
మిథునం (Gemini): నూతన పనుల్లో ఉత్సాహంగా పనిచేస్తేనే పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన మీకు ఆనందాన్నిస్తుంది. కీలక విషయాల్లో పెద్దల సహకారం అవసరం. ఆదిత్య హ్రుదయం చదవండి.
కర్కాటకం (Cancer): శుభకాలం నడుస్తోంది. అన్ని రంగాల వారికి కలిసొచ్చే కాలం. లాభాలు గడిస్తారు. బంధుమిత్రుతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణ సూచన ఉంది. దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం మంచిది.
సింహం (Leo): మిశ్రమ కాలం. చేపట్టిన పనులలో కొన్ని ఆగిపోయే అవకాశం ఉంది. అయితే పట్టువదలకుండా చేసే పనులు ఫలితాలను ఇస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి.
కన్య (Virgo): అన్ని రంగాల వారికీ పనిభారం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సూచన పాటిస్తే మేలు జరుగుతుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. అధిక ధనవ్యయం తప్పదు. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
తుల (Libra): శుభకాలం. పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. అన్ని పనులను పూర్తిచేస్తారు. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఇష్టదైవారాధన మానవద్దు.
వృశ్చికం (Scorpio): అనుకున్న పని సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక వార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం చదవండి.
ధనస్సు (Sagittarius): నూతనంగా చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు వస్తుంది. కుటుంబసభ్యులతో కలిసి విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
మకరం (Capricorn): ప్రతి పనిలో ఆచితూచి అడుగేయాలి. ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తే ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అధిక ధనవ్యయం తప్పదు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళిని చదవండి.
కుంభం (Aquarius): అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. శ్రమిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆదిత్యహృదయం పఠించడం మంచిది.
మీనం (Pisces): ఉద్యోగంలో కలిసి రానుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరమవుతాయి. సకాలంలో మీకు సాయం అందుతుంది. ప్రయాణ సూచన ఉంది. శివారాధన చేయడం మంచిది.
Also Read: Honey precautions: తేనెతో అవి కలిపి తింటే..ఒక్క స్పూన్ తేనె కూడా విషమైపోతుంది
Also Read: Special Discount on iPhones: ఊహించని ధరకు ఐఫోన్ 13, ఐఫోన్ 11, ఐఫోన్ 12 మినీ, ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook