Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 21, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనవ్యయం

Today Horoscope In Telugu 21 April 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 21వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2021, 08:10 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 21, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనవ్యయం

Horoscope Today 21 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 21వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీ వ్యాపారం ఈ రోజు విజయవంతం కానుంది. మరియు నూతన వ్యాపార భాగస్వామితో కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. కుటుంబసభ్యుల వివాహానికి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ రోజు ప్రజలు గుంపు సమాహాల నుండి దూరంగా ఉండటం శ్రేయస్కరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగుల పని ఒత్తిడి పెరుగుతంది.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

వృషభ రాశి
ఈ రోజు మీ కార్యాలయాన్ని పునరుద్ధరించడంలో మీ వ్యక్తిగత నైపుణ్యాలు మీకు దోహదం చేస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో గతంలో కన్నా మెరుగ్గా కనెక్ట్ అవుతారు. కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఆరోగ్య సమస్యలు ఈ రోజు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

మిథున రాశి
తోబుట్టువుల సంబంధిత సమస్యలతో మీరు నేడు తీరిక లేకుండా గడుపుతారు. కొందరికి మీ సహాయం అవసరం కావచ్చు. పని ఒత్తిడి నుంచి నేడు విరామం తీసుకోవాలని భావిస్తారు. పిల్లలు ఈ రోజు మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకోలేరు, ఇది కొంత ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తుంది. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందవు. అధికంగా శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే.  

కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారి ఆరోగ్య సమస్యలు ఈ రోజు పరిష్కరించబడతాయి. మీ సహోద్యోగులకు మీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఇంట్లో మీరు మీ తోబుట్టువుతో మంచి బంధాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. విద్యార్థులు అధ్యయనాలపై కొంచెం ఎక్కువ దృష్టిసారించాలి. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం అందనుంది. వ్యాపారాలలో సానుకూలత కనిపిస్తుంది.

సింహ రాశి
వ్యాపారం రంగంలో ఉన్న వారికి ఈ రోజు మంచి రోజు. మీ పని కోసం మీరు కొత్త క్లయింట్లను కలుసుకుని, ఒప్పందం కుదుర్చుకుంటారు. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

కన్య రాశి
మీకున్న పరిచయాలు, సంబంధాల కారణంగా వ్యాపారం ఊహించిన దాని కన్నా మెరుగ్గా కొనసాగుతుంది. కుటుంబంలో నెలకొన్న ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. యువతీయువకులు ప్రేమ లాంటి సమస్యలలో చిక్కుకోనున్నారు. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం శ్రేయస్కరం. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 

తులా రాశి
మీరు ఈ రోజు పనిలో సందేహాలు తలెత్తుతాయి. మరియు ఆ విషయాలను గుర్తించడానికి మీకు వేరొకరి సహాయం అవసరం. మీ ఇంట్లో జరిగే కొన్ని విషయాలకు మీరు ఆశ్చర్యపోతారు. పిల్లల చదువు సమస్యలు పరిష్కరించబడతాయి. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

వృశ్చిక రాశి
మీ ఆవేశం సమస్యలకు కారణం అవుతుంది. నేడు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ సన్నిహితుడితో నమ్మకంగా వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకుంటారు. తల్లిదండ్రులు మీతో కొంత సమయం గడపాలని అనుకోవచ్చు. విద్యార్థులు చదువు పూర్తయితే కెరీర్ ఎంచుకోవడానికి లేదా మార్చడానికి ఇది మంచి సమయం. మీ సృజనాత్మకతతో రంగాన్ని ఎంచుకుంటారు.

ధనుస్సు రాశి
ఈ రోజు మీరు చాలా ప్రశాంతంగా వ్యవహరిస్తారు. మీరు పనిచేసే చోట సహచరులు మరియు సహోద్యోగులతో సామరస్యంగా ఉంటారు. ఇంట్లో ఉన్నవారు ఈ రోజు మీ భావాలను, మాటలను అర్థం చేసుకుంటారు. మాటపట్టింపులు వచ్చిన దంపతులు కలిసి చర్చించుకుని వారి సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. నూతన విధానాలతో మీ వ్యాపారం వృద్ధి చెందనుంది.

Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

మకర రాశి
మకర రాశి వారు సానుకూల మనస్తత్వంతో ముందుకు సాగుతారు. సమస్యలను పరిష్కరించడంలో ఇది మీకు సహాయపడుతుంది. కొన్ని లాభాలు నష్టాలుగా మారే అవకాశం ఉన్నందున మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. ఉద్యోగులకు శ్రమకు తగ్గ గుర్తింపు లభించనుంది.

కుంభ రాశి
భవిష్యత్తులో ఎక్కువ ఆదాయాన్ని పొందడం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మీరు కొత్తగా క్రీడలపై ఆసక్తి కనబరుస్తారు. ఇందుకోసం బటయకు వెళ్లి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

మీన రాశి
ఈ రోజు మీ కార్యాలయంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. పనిని కొనసాగించడానికి నమ్మకమైన వ్యక్తుల కోసం ఎదురుచూస్తారు. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపాలని భావిస్తారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు పనిచేసే చోట ఒత్తిడి నెలకొంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News