Horoscope Today In Telugu 24 June 2021: నేటి రాశి ఫలాలు 24 జూన్ 2021, Rasi Phalalu, ఓ రాశివారు స్థిరాస్తులు కొనుగోలు

Horoscope Today 24 June 2021: మీదే పైచేయి కావాలని, అందరిలో ముందుండాలని భావిస్తారు. కానీ ప్రతి సందర్భంలోనూ ఒకరినే విజయం వరించదని గ్రహిస్తారు. ఫలితంతో సంబంధం లేకుండా సంతృప్తి చెందడానికి సిద్ధమవుతారు. వాహనాలు కొనుగోలు చేయాలని అనుకుంటారు. కొన్ని పనులు పూర్తవుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 24, 2021, 08:16 AM IST
Horoscope Today In Telugu 24 June 2021: నేటి రాశి ఫలాలు 24 జూన్ 2021, Rasi Phalalu, ఓ రాశివారు స్థిరాస్తులు కొనుగోలు

Horoscope Today 24 June 2021: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జూన్ 24వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
అవసరమైతేనే వస్తువులకు ఖర్చు చేయాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండకపోతే ఆర్థిక సమస్యలు తప్పవు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. మీకు నమ్మశక్యం కాని ఒప్పందం లేదా ఆశ్చర్యపరిచే విషయాలు జరుగుతాయి. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది.

వృషభ రాశి
మీరు అనుమానించిన దానికంటే ఎక్కువ విషయాలు ఉన్నాయని గ్రహిస్తారు. చాలా రోజుల తరువాత కొందరు మిత్రులు కలుసుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికంగా శ్రమిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

మిథున రాశి
మీదే పైచేయి కావాలని, అందరిలో ముందుండాలని భావిస్తారు. కానీ ప్రతి సందర్భంలోనూ ఒకరినే విజయం వరించదని గ్రహిస్తారు. ఫలితంతో సంబంధం లేకుండా సంతృప్తి చెందడానికి సిద్ధమవుతారు. వాహనాలు కొనుగోలు చేయాలని అనుకుంటారు. కొన్ని పనులు పూర్తవుతాయి. 

కర్కాటక రాశి 
మీరు నియంత్రణలో ఉంటడం అవసరం. కొన్ని విషయాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం మీ సొంతమవుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలు ఎదురవుతాయి. సోదరులు, సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

సింహ రాశి
నేర్చుకోవటానికి మీకు ఆసక్తి ఉంటుంది. అయితే అందుకు తగిన సమయం ఉండదని బాధపడతారు. మీరు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడం ద్వారా కెరీర్‌కు మార్గం తయారవుతుంది. యువతకు నిరాశకరమైన ఫలితాలు వస్తాయి. వాస్తవంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.

కన్య రాశి
గతంలో చేసిన పనులకు ఈ రోజు ప్రయోజనాలను పొందుతారు. శుభకార్యాలు నిర్వహించడానికి నగదు సమకూర్చుకుంటారు. కొన్ని విషయాలలో నిపుణులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. వ్యాపారులు నూతన పెట్టుబడుల జోలికి వెళ్లకూడదు. 

తులా రాశి
ఇతరులు కోరిన కొంత కాలానికి వారికి సహాయం చేస్తారు. చిన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు సమయాన్ని కేటాయిస్తారు. ఈరోజు మీకు చాలా ఉత్సాహభరితంగా గడుస్తుంది. అంది వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదని గ్రహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరగడంతో దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు ఆచితూచి అడుగు వేయాలి.

వృశ్చిక రాశి 
ఈ రోజు మీ సమస్యలకు పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. చుట్టూ ఉన్న కొందరు మీ వెనుక కుట్ర పన్నే అవకాశాలున్నాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. కొత్త విషయాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. తక్కువ సమయంలోనే ఉద్యోగులు పనిని పూర్తి చేస్తారు. 

ధనుస్సు రాశి
అందరి పనులను చేస్తూ తీరిక లేకుండా గడుపుతారు. కానీ ఒకే సమయంలో పలు పనులలో నిమగ్నమవడం ద్వారా కొంత చికాకు కలుగుతుంది. మీ జీవిత భాగస్వామి మరియు సహచరుల సహకారంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. వ్యాపారులకు ఆచితూచి వ్యవహరించకపోతే నష్టాలు తప్పవు. 

మకర రాశి
ఎక్కువ మంది వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ఇది సరైన సమయంగా భావిస్తారు. కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో అనాలోచితంగా చర్చిస్తారు. కావాలసిన సమాచారాన్ని సేకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండే అవకాశాలు.

కుంభ రాశి
ఈ రోజు మీకు చాలా భారంగా గడవనుంది. అయినప్పటికీ, కర్మ ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మీరు నిపుణుడిగా ఉన్న రంగంలో కొన్ని సాహసాల దిశగా అడుగులు వేస్తారు. స్తిరాస్థి కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. కొన్ని శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. అన్ని రంగాల వారికి శుభాలు కలుగుతాయి.

మీన రాశి
అధికంగా శ్రమించినా ఫలితం కోసం నిరీక్షించక తప్పదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులు సాయంత్రం వరకు కొన్ని కీలక విషయాలు తెలుసుకుంటారు. కుటుంబసభ్యులతో కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి. ముక్కుసూటిగా నడుచుకోవడంతో కొన్ని మార్పులు సంభవిస్తాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News