Death Threats to Salman Khan Lawyer: పంజాబ్ లో జరిగిన సిద్దు మూసేవాలా దారుణ హత్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటన సంచలనం రేపింది. ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనే విషయాన్ని తర్వాత పోలీసులు పసిగట్టారు. అయితే ఈ గ్యాంగ్ సభ్యులు సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ వాకింగ్ చేస్తూ ప్రతిరోజు రెస్ట్ తీసుకునే బెంచి మీద సల్మాన్ ఖాన్ సహా సలీం ఖాన్ ను చంపేస్తామని ఒక బెదిరింపు లేఖ వదిలి వెళ్లారు. ఒక్కసారిగా కలకలం రేగడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించడమే కాక ఈ లేఖ వదిలింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనే విషయాన్ని ధృవీకరించారు.
ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సహా ఆయన తండ్రికి కూడా భద్రత పెంచారు. కృష్ణ జింకను చంపిన విషయంలో సల్మాన్ ఖాన్ మీద కొన్నాళ్లు కేసు నడిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే లారెన్స్ బిష్ణోయ్ కులానికి ఆ కృష్ణ జింక చాలా పవిత్రమైనదని అందుకే ఎప్పటికైనా సల్మాన్ ఖాన్ ను చంపేస్తానని లారెన్స్ విష్ణువు పేర్కొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ కేసు వాదించిన లాయర్ కు కూడా బెదిరింపు లేఖ పంపడం సంచలనం రేపుతోంది. తమ లాయర్ హస్తిమల్ సారస్వత్ కు బెదిరింపు లేఖ వచ్చినట్లుగా లాయర్ అసిస్టెంట్ జోద్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నేరుగా కోర్టులో ఉన్న లాయర్ ఛాంబర్ లోని ఈ బెదిరింపు లేక లభ్యమయిందని శత్రువుకి మిత్రుడు తమకు శత్రువేనని ఆ కేసులో సల్మాన్ ఖాన్ తరపున వాదించిన నేపథ్యంలో మిమ్మల్ని చంపేయడం ఖాయమని సిద్ధూ మూసేవాలకు ఎలాంటి గతి పట్టిందో మీకు కూడా అలాంటి గతి పట్టడం ఖాయమని బెదిరింపు లేఖలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ లేఖ నిజమైనదేనా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నిజంగా బెదిరింపులకు పాల్పడిందా అనే విషయం మీద ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కానీ ముందు జాగ్రత్త చర్యతో పోలీసులు సదరు లాయర్ కి ప్రస్తుతం రక్షణ కల్పించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన భారతదేశంలో లేరని వేరే దేశంలో ఉన్నారని తెలుస్తోంది. ఆయన వచ్చాక పూర్తిస్థాయిలో ఆయనకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.
Also Read: Suchendra prasad: మైసూర్ ఘటన తర్వాత భర్తకు పవిత్ర లోకేష్ ఫోన్.. అవి బయటపెడతానన్న సుచేంద్ర ప్రసాద్!
Also Read: Sammathame OTT: అప్పుడే ఓటీటీకి 'సమ్మతమే'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook