Horoscope Today September 4th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు తమ ప్రియమైన వ్యక్తులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చే ఛాన్స్..

Horoscope Today September 4th 2022: ఇవాళ ఆదివారం. హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ ఎరుపు, కాషాయ రంగు వస్త్రాలు ధరించవద్దు. గోధుమలు, బెల్లం, ఎరుపు రంగు పూలు దానం చేయడం మీకు శుభ ఫలితాలనిస్తుంది. మరి ఈ ఆదివారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..   

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 4, 2022, 06:35 AM IST
  • ఇవాళ ఆదివారం.. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు
  • సూర్య భగవానుడి అనుగ్రహంతో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే
Horoscope Today September 4th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు తమ ప్రియమైన వ్యక్తులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చే ఛాన్స్..

Horoscope Today September 4th 2022: ఇవాళ ఆదివారం. హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ ఎరుపు, కాషాయ రంగు వస్త్రాలు ధరించవద్దు. గోధుమలు, బెల్లం, ఎరుపు రంగు పూలు దానం చేయడం మీకు శుభ ఫలితాలనిస్తుంది. మరి ఈ ఆదివారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 

మేష రాశి (Aries)

ముఖ్యమైన పనుల్లో ఓపిక చాలా అవసరం. ఆఫీసులో కీలకమైన ప్రాజెక్టుకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటారు. కష్టపడే తత్వం ద్వారా మీ లక్ష్యాలను చేరుకుంటారు. దయాగుణంతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాల పట్ల జాగ్రత్త అవసరం. వ్యాపారంలో స్థిరమైన లాభాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సమానత్వానికి ప్రాధాన్యతనివ్వాలి.

వృషభ రాశి (Taurus)

ఏ పనైనా వాయిదా వేసే అలవాటు మానుకోండి. ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థికంగా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. రిలేషన్‌షిప్‌, ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కోరుకున్న జాబ్ దొరకవచ్చు. మీలో ఉత్సాహం, నైతికత మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. వ్యాపారంలో ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు కొత్త ప్లాన్స్ సిద్ధం చేసుకుంటారు. 

మిథున రాశి (GEMINI)

మీ లక్ష్య సాధన కోసం ఈరోజును అంకితం చేస్తారు. కష్టపడటమే సక్సెస్‌కి మార్గమని గుర్తిస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. మందకొడిగా సాగిన వ్యాపారం ఇప్పుడు ఊపందుకుంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మద్దతు పొందుతారు. ఆఫీసులో సీనియర్స్ సహాయ సహకారాలు లభిస్తాయి. భావోద్వేగంతో కూడిన వ్యవహారాల్లో సహనం అవసరం. మీకు ప్రియమైన వ్యక్తుల కోసం ఏదైనా చేయాలనుకుంటారు.

కర్కాటక రాశి (Cancer) 

ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ లైఫ్ స్టైల్ మునుపటికన్నా మెరుగవుతుంది. మీ ప్రియమైన వ్యక్తులకు మీ పట్ల మరింత నమ్మకం ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితుల నుంచి లబ్ది పొందుతారు. సాహసోపేతమైన ఒక ప్రయత్నం చేస్తారు. ఆచరణకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఏ పనిచేసినా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. సాయంత్రం సమయంలో సరదాగా స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడుతారు. 

సింహ రాశి (LEO)

కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఇంటికి అతిథులు వస్తారు. మీ స్నేహితుల జాబితాలోని చాలామందితో ఇవాళ ఇంటరాక్ట్ అవుతారు. అందరితో సామరస్యపూర్వక, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తారు. ముఖ్య పనుల పట్ల దృష్టి కేంద్రీకరిస్తారు. పెద్దలు చెప్పే మాట వినాలి. రక్త సంబంధీకులతో సంతోష సమయాలను పంచుకుంటారు. ఉద్యోగ, వ్యాపారస్తులకు అన్నివిధాలా అనుకూల సమయం.

కన్య రాశి (Virgo)

బద్దకాన్ని వీడి యాక్టివ్‌గా ఉంటేనే పనులు పూర్తవుతాయి. ముఖ్య పనుల్లో నిర్లక్ష్యం తగదు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మతపరమైన లేదా సేవాపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అన్నాదమ్ముళ్లతో బంధం మరింత బలపడుతుంది. రెగ్యులర్ పనులను మరింత చురుకుగా చేస్తారు. 

తులా రాశి (Libra)

మీ వ్యక్తిత్వం ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తుంది. కుటుంబపరంగా మీ బాధ్యతలను నెరవేరుస్తారు. మీ ప్రియమైన వ్యక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఊపందుకుంటాయి. మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతున్నామనే సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారస్తులకు ఇది అనుకూల సమయం. ఇతరులకు డబ్బు అప్పుగా ఇచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి (Scorpio)

క్రియేటివ్ పనుల్లో తలమునకలై ఉంటారు. వ్యాపారస్తులు పెద్దల సలహాలు, సూచనలతో లబ్ది పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. నైతికత మీకు పెద్ద బలం. మీలో సున్నితత్వం, సంతోషం పెరుగుతాయి. మీ ప్రియమైన వ్యక్తులకు సడెన్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తారు. మీ ప్రవర్తన ఎప్పుడూ మర్యాపూర్వకంగా, మధురంగా ఉంటుంది. 

ధనుస్సు రాశి (Sagittarius)  

ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబపరంగా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఓపిక అవసరం. రెండు పెద్ద లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన స్పూర్తిని పొందుతారు. వ్యాపారంలో మీ పేరుకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇతరుల నుంచి అప్పు తీసుకునే అలవాటు మానుకోండి. 

మకర రాశి (Capricorn) 

వచ్చిన అవకాశాలను చేజారనివ్వొద్దు. వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోండి.అందరి నమ్మకాన్ని చూరగొనేలా వ్యవహరిస్తారు. ఆరోగ్యం, లైఫ్ స్టైల్ బాగుంటాయి. ముఖ్య వ్యవహారాల్లో మీకు అనుకూలత చేకూరుతుంది. ఇవాళ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. మీలో కాన్ఫిడెన్స్ చాలా హైలో ఉంటుంది. సన్నిహితులు, స్నేహితుల మద్దతు లభిస్తుంది.

కుంభ రాశి (Aquarius)

ప్రొఫెషనల్ డీలింగ్స్‌తో బిజీగా గడుపుతారు. వ్యాపార ప్రణాళికలు ముందుకు తీసుకెళ్లే యోచనలో ఉంటారు. లాభాలు పొందే అవకాశాలు మెరుగవుతాయి. స్మార్ట్ వర్కింగ్‌ను అలవరుచుకుంటారు.ప్రేమికులకు శుభదినం. ఉద్యోగస్తుల కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి.

మీన రాశి (Pisces) 

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. పబ్లిక్ వెల్ఫేర్‌కి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. బిజినెస్ పరంగా బాగా రాణిస్తారు. ఇదివరకటి కన్నా వ్యాపారం లాభాలను తీసుకొస్తుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమించే వ్యక్తులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. రిస్క్‌తో కూడిన పనుల్లో తలదూర్చవద్దు. ముఖ్యమైన పనుల్లో పూర్తి శక్తి, సామర్థ్యాలను వెచ్చించాలి. కొన్నిసార్లు స్వీయ నియంత్రణ అవసరమవుతుంది. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Hero Nani Adopted Puppy: వీధి కుక్కపిల్లను దత్తత తీసుకున్న హీరో నాని

Also Read: టీమిండియాతో మ్యాచ్.. పాకిస్థాన్‌కు భారీ షాక్! పండగ చేసుకుంటున్న భారత్ ఫాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News