Horseshoe For Money: వాస్తు శాస్త్రంలో అనే రకాల విషయాల గురించి ప్రస్తావించారు. వ్యక్తి జీవితానికి సంబంధించిన చాలా విషయాలు అందులో పేర్కొన్నారు. అయితే చాలా మంది అదృష్టాన్ని పెంచుకునేందు వివిధ రకాల చిట్కాలను అందులో పేర్కొన్నారు. అయితే అదృష్టాన్ని పెంచుకోవడానికి గుర్రపు నాడ ప్రభావవంతంగా పని చేస్తుందని చాలా మంది భారతీయులు నమ్ముతారు. దీని పూజించి, మంత్రించి ఇంట్లో సరైన దిశలో, సరైన స్థలంలో అమర్చడం వల్ల ఇంట్లో ఆనందం, ఆర్థికపరమైన సమస్యలు కూడా సులభంగా తీరుతాయని నిపుణులు తెలుపుతున్నారు. గుర్రపుడెక్క గురించి వాస్తు శాస్త్రంలో చాలా నివారణలు అవేంటో మనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
వాస్తు శాస్త్రంలో గుర్రపునాడ చాలా ప్రయోజనకరమైనదిగా..పవిత్రమైనదిగా పేర్కొన్నారు. చెడు దృష్టి నుంచి నివారించడానికి గుర్రపు నాడ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. వాస్తు నియమాల ప్రకారం గుర్రపుడెక్కను ఉపయోగించినప్పుడు మాత్రమే దాని శుభ ఫలితాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ డెక్క వల్ల జరిగే ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
గుర్రపునాడ ప్రాముఖ్యత:
గుర్రపునాడ రెండు రకాలుగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒకటి U షేప్‌లో ఉంటే, మరొకటి రివర్ స్యూ ఆకారంలో ఉంటుంది. ఈ రెండు ఆకారాలు కలిగిన వాటిని మనం వినియోగించవచ్చు. దుకాణం, కార్యాలయంలో ఉపయోగిస్తే ఆర్థిక పరమైన సమస్యలు సులభంగా తీరుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వీటి వ్యాపార సంస్థలో, ఆఫీల్లో పెట్టుకుంటే..ఆర్థికంగా, సామాజీకంగా బలపడుతారని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ప్రతికూల శక్తి చెక్:
గుర్రపునాడను చాలా మంది ఇంటి నుంచి ప్రతికూల శక్తి ని తొలగించేందుకు వినియోగిస్తారు. అయితే దీనిని ఇంటి మెయిన్ డోర్ పై కట్టుకోవడం వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీ కూడా పెంచేందుకు సహాయపడుతాయి. అంతేకాకుండా దీనిని గుమ్మాని కట్టుకుని పూజించడం వల్ల డబ్బు, ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నిపుణులు పేర్కొన్నారు. దీనిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల వ్యాపారంలో ఆర్థిక పరిస్థితులు కూడా మారుతాయి.
ఎక్కడ వీటిని పెట్టుకోడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు:
గుర్రపునాడను ఇంట్లో, షాపింగ్ లో పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా చాలా మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని ఇంటి ప్రధాన ద్వారం పై అమర్చడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. అయితే దీనిని అమర్చే ముందు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని కేవలం పడమర దిశలో మాత్రమే అమర్చాలని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి