Laughing Buddha: లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఈ దిక్కున పెడితే ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది..

ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇల్లు లేదా ఆఫీసులో పెట్టే ముందు వాటి నియమాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.చాలా మంది లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచుతారు. లాఫింగ్ బుద్ధుని ఉంచడానికి నియమాలో ఏంటో తెలుసుకుందాం.. 

Written by - Renuka Godugu | Last Updated : Jan 31, 2024, 10:15 AM IST
Laughing Buddha: లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఈ దిక్కున పెడితే ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది..

Laughing Buddha Direction: ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇల్లు లేదా ఆఫీసులో పెట్టే ముందు వాటి నియమాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.చాలా మంది లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచుతారు. లాఫింగ్ బుద్ధుని ఉంచడానికి నియమాలో ఏంటో తెలుసుకుందాం.. 

ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. ఫెంగ్ షుయ్ గ్రంథాలు లాఫింగ్ బుద్ధుని ఉంచడానికి కొన్ని నియమాలను పేర్కొన్నాయి. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచే ముందు ఆ నియమాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రతికూలతను తొలగించవచ్చు. వీటిలో లాఫింగ్ బుద్ధ ఒకటి.  

ఈ దిశలో ఉంచాలి..
లాఫింగ్ బుద్ధను ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. లాఫింగ్ బుద్ధుడిని రెండు చేతులూ పైకెత్తి నవ్వుతూ ఉన్న విగ్రహాన్ని తూర్పు దిశలో మాత్రమే ఉంచాలి. దీన్ని పొరపాటున కూడా ప్రధాన ద్వారం ముందు పెట్టకూడదు. 

లాఫింగ్ బుద్ధను వంటగది, పడకగదిలో ఉంచకూడదు. దీనివల్ల ఆ ఇంటికి ప్రతికూలతకు దారితీస్తుంది. ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచేటప్పుడు, ఇంటి ప్రధాన గేటు ముందు కనీసం 30 అంగుళాల ఎత్తులో ఉంచాలి. 

లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని సొంత డబ్బుతో కొనకూడదు. అది మంచి ఫలితాలను ఇవ్వదు అంటారు. లాఫింగ్ బుద్ధ బహుమతిగా అందుకోవడం శుభప్రదం. ఇది ఇంటికి శుభ ఫలితాలను తెస్తుంది. 

ప్రతి ఒక్కరూ ఆయనను దేవుడిగా భావించి వారి ఇళ్లలో విగ్రహాలను ఉంచడం ప్రారంభించారు.  చైనీస్ నమ్మకం ప్రకారం లాఫింగ్ బుద్ధ ఒక చైనీస్ దేవత, అతను పుటై అనే పేరుతో పిలువబడ్డాడు. బొద్దుగా ఉండే శరీరంతో అందరినీ నవ్వించేవాడు. 

ఇదీ చదవండి: Solar Eclipse 2024: మొదటి సూర్యగ్రహణం 2024 ఏ రోజు రానుంది?.. భారతదేశంపై ప్రభావం ఉంటుందా?

ఇదీ చదవండి:  Today Rasi Phalalu, 31 January 2024: ఈరోజు 4 రాశులవారికి శుభప్రదం.. అన్ని రాశులకు ఈనెల చివరిరోజు ఎలా ఉంటుందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News