Solar Eclipse 2024: మొదటి సూర్యగ్రహణం 2024 ఏ రోజు రానుంది?.. భారతదేశంపై ప్రభావం ఉంటుందా?

Solar Eclipse 2024 Date and Time: 2024లో ఎన్ని సూర్య, చంద్రగ్రహణాలు సంభవిస్తాయో, వాటి ప్రభావం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.  సూర్యగ్రహణం, చంద్రగ్రహణం 2024 సంవత్సరంలో కూడా సంభవించబోతున్నాయి. 

Written by - Renuka Godugu | Last Updated : Jan 31, 2024, 08:11 AM IST
Solar Eclipse 2024: మొదటి సూర్యగ్రహణం 2024 ఏ రోజు రానుంది?.. భారతదేశంపై ప్రభావం ఉంటుందా?

Solar Eclipse 2024 Date and Time: 2024లో ఎన్ని సూర్య, చంద్రగ్రహణాలు సంభవిస్తాయో, వాటి ప్రభావం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.  సూర్యగ్రహణం, చంద్రగ్రహణం 2024 సంవత్సరంలో కూడా సంభవించబోతున్నాయి. 

 2024 సూర్యగ్రహణం తేదీ, సమయం.. 
2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న జరుగుతుంది. ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 39 నిమిషాలు ఉంటుంది. 

మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ కారణంగా ఈ సూర్యగ్రహణం సూతక కాలం భారతదేశంలో చెల్లదు. నైరుతి యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలో 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కనిపిస్తుంది. 

భారత కాలమానం ప్రకారం 2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2న రాత్రి 9:13 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:17 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా రెండవ సూర్యగ్రహణం మొత్తం వ్యవధి 6 గంటల 4 నిమిషాలు ఉంటుంది. రెండవ సూర్యగ్రహణం ఈ ఏడాది అక్టోబర్ 2 ,3 రాత్రి సంభవిస్తుంది.  

సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం భారతదేశంలో కూడా కనిపించదు. కాబట్టి, ఈ సూర్యగ్రహణం సూతక కాలం కూడా పరిగణించబడదు.  సుతక కాలం 2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అమెరికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ ధ్రువంలో కనిపిస్తుంది. 

ఇదీ చదవండి: Today Rasi Phalalu, 31 January 2024: ఈరోజు 4 రాశులవారికి శుభప్రదం.. అన్ని రాశులకు ఈనెల చివరిరోజు ఎలా ఉంటుందంటే..?

ఇదీ చదవండి: February Born Personality: ఫిబ్రవరిలో పుట్టినవారు తెలివైనవారు.. వారిలో ఉండే ఈ అరుదైన లక్షణం మీకు తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News