Guru Gochar 2023: త్వరలో బృహస్పతి రాశి మార్పు.. దశ తిరగనున్న రాశులివే...!

Guru Gochar 2023: గ్రహాల రాశి మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. త్వరలో బృహస్పతి తన రాశిని మార్చనున్నాడు. ఇది ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2023, 04:38 PM IST
Guru Gochar 2023: త్వరలో బృహస్పతి రాశి మార్పు.. దశ తిరగనున్న రాశులివే...!

Guru Gochar 2023:  వేద జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి అదృష్టాన్ని ఇచ్చే గ్రహంగా పిలుస్తారు. విద్య, పిల్లలు మరియు సంపదకు కారకుడిగా గురుడిని భావిస్తారు. బృహస్పతి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా గురుడు ఏడాదికొకసారి రాశిని మారుస్తాడు. వచ్చే నెలలో అంటే ఏప్రిల్ 22న బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గురు సంచారం 5 రాశులవారికి భారీ ప్రయోజనాలను అందించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం: బృహస్పతిని మేషరాశికి స్నేహపూర్వక గ్రహంగా పిలుస్తారు. ఏప్రిల్ 22న ఈ రాశి యొక్క మొదటి ఇంటిలో రాహు, బృహస్పతి, సూర్యుడు మరియు బుధ గ్రహాల మధ్య ఖగోళ సంయోగం ఏర్పడబోతుంది. దీంతో మేషరాశి వారు ఆర్థికంగా ప్రయోజనం పొందనున్నారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. 
మిథునరాశి: గురు సంచారం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు వ్యాపారంలో భారీగా లాభాలను గడిస్తారు. డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.

సింహం: బృహస్పతి సంచారం సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈరాశి యెుక్క తొమ్మిదో ఇంట్లో గురు గోచారం జరుగుతుంది. దీంతో వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. 
మకరం : గురు సంచారం వల్ల మకరరాశి జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది. ఈ సమయంలో ఏదైనా లగ్జరీ ఐటమ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
మీనం: బృహస్పతి సంచారం మీన రాశి వారికి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ లో అపారమైన పురోగతి ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.  

Also Read: Shukra Budh Gochar: మేషరాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులకు పండగే పండుగ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News