Managl-Shani Yuti 2022: దీపావళికి ముందు కుజుడు-శని కలయిక... ఈ 4 రాశులవారికి తిరుగుండదు ఇక...

Mars Transit 2022: సాధారణంగా అంగారకుడు 45 రోజులకు ఒకసారి తనరాశిని మారుస్తాడు. ఈసారి కుజుడు అక్టోబరు 16న మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2022, 04:43 PM IST
Managl-Shani Yuti 2022: దీపావళికి ముందు కుజుడు-శని కలయిక... ఈ 4 రాశులవారికి తిరుగుండదు ఇక...

Mars Transit 2022 Impact On Zodiac Sign: ఆస్ట్రాలజీలో కుజుడిని అన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. ప్రతి గ్రహం నిర్దిష్ట వ్యవధిలో తన రాశిని మార్చుకుంటుంది. కుజుడు 45 రోజులకు ఒకసారి రాశిని మారుస్తాడు. ఈనెల 16న కుజుడు వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కుజుడు, శని ఇద్దరూ శత్రువులు. త్వరలో ఈ రెండు కలిసి షడష్టక యోగాన్ని (Shadashtaka Yoga) ఏర్పరచబోతున్నాయి. అంతేకాకుండా అంగారక సంచారం ఏ రాశివారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం. 

మేషం (Aries)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుజుడు తన శత్రు గ్రహమైన బుధుడు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశులవారు ప్రత్యేకంగా ప్రయోజనం పొందబోతున్నారు. అందులో మేష రాశి వారు కూడా ఉన్నారు. ఈ రాశిచక్రం మూడవ ఇంట్లో అంగారక సంచారం జరుగబోతుంది. దీంతో మీరు మీ పనుల్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  
సింహం (Leo)- ఈ రాశికి చెందిన ఏకాదశి ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీంతో మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా పురోగమిస్తారు. ఈసమయంలో మీ సౌకర్యాలు మెరుగుపడతాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం కలిసి వస్తుంది.  
మకరం (Capricorn)- ఈ రాశిచక్రంలోని ఆరవ ఇంట్లో అంగారక సంచారం జరగబోతుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యారంగంలో మెరుగైన పనితీరును కనబరుస్తారు. వ్యాపారం పెరుగుతుంది, భారీగా లాభాలు ఉంటాయి.  
మీనం (Pisces)- ఈ రాశి యెుక్క నాల్గో ఇంట్లో కుజడు సంచరించబోతున్నాడు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మెుత్తానికి ఈ సమంయ మీకు అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Guru Margi 2022: దీపావళి తరువాత అరుదైన యోగం.. ఇక ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.         

Android Link - https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News