Mauni Amavasya Maun Vrat Significance: ఈ సంవత్సరం మౌని అమావాస్య ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇదే రోజు మకర రాశిలో పంచగ్రహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం ఏడు దశాబ్దాల తర్వాత ఈ సంవత్సరం రాబోతోంది. గ్రహాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు అమావాస్య రోజున మకరరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మౌని అమావాస్య ఫిబ్రవరి 9 శుక్రవారం ఉదయం 7:27 నుంచి శనివారం ఉదయం 4:28 వరకు ఉంటుంది. ఈ అమావాస్యను జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పండగలాగా జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ఈ రోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన సర్వార్థ సిద్ధి యోగం, మాళవ్య యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. అయితే రోజు శుభ సమయంలో నది స్నానాలు చేయడం కూడా చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మౌని అమావాస్య రోజు పవిత్ర నది స్నానాన్ని ఆచరించి మౌన వ్రతం చేయడం వల్ల జీవితంలో కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. అలాగే సంపాదన కూడా రెట్టింపు అవుతుందని పూర్వీకులు చెబుతున్నారు. దీంతో పాటు ఈ రోజు చాలా మంది పూర్వీకులను కూడా పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో మకరరాశిలో సూర్యుడు చంద్రునితో కలిసి ఉండే కాలాన్నే మౌని అమావాస్య అంటారు. దీంతో పాటు ఇదే రోజు మకరరాశిలో పంచగ్రహి యోగం ఏర్పడబోతోంది. అలాగే ఈ మౌని అమావాస్య రోజున మాళవ్య యోగాలతో పాటు మరికొన్ని ప్రత్యేక యోగాల కలయిక జరగబోతోంది.
100 అశ్వమేధ యాగాల ఫలితం కలుగుతుంది:
ఈ అమావాస్య రోజున పవిత్ర నది లేదా గంగా నది స్నానం చేసి దానాలు చేయడం వల్ల పుట్టిన బిడ్డలకు అఖండ విజయాలతో పాటు సౌభాగ్యం కలుగుతాయి. దీంతో పాటు నది స్నానం చేసిన తర్వాత పేదవారికి వస్తువు దానం చేయడం వల్ల వంద అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ మౌని అమవాస్య రోజు మకర రాశిలో సూర్య గ్రహం సంచార దశలో ఉండడం వల్ల అమావాస్యకు ప్రాధాన్యత పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
శుభ ముహూర్తం(mauni amavasya 2024 date):
మౌని అమావాస్య ఫిబ్రవరి 9 ఉదయం 7:27 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 10 ఉదయం 4:27 వరకు కొనసాగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు ఏర్పడబోయే సిద్ధి యోగ ప్రభావం దాదాపు 7 గంటల పాటు ఉంటుంది. పద్మపురాణం ప్రకారం.. మాఘమాస అమావాస్య రోజు నుంచి శుభ ఘడియలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అమావాస్యకు ఎంతో ప్రత్యేక ప్రముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కోరికలు తీరని వారు ఈ రోజు ప్రవిత్ర నది స్నానాన్ని ఆచరించి మౌన వ్రతం పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter