Mercury Transit 2023: నేటి నుంచి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీరున్నారా?

Mercury Transit 2023: నిన్న బుధ గ్రహం మీనం నుండి మేషరాశికి మారింది. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ  రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 11:54 AM IST
Mercury Transit 2023: నేటి నుంచి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీరున్నారా?

Budh Gochar Effect 2023:  ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. నిన్న బుధుడు మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించాడు. ఈ బుధ సంచారం వల్ల కొందరికి శుభం కలిగిస్తే.. మరికొందరిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.  డబ్బు, తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడైన మెర్క్యూరీ సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

మిధునరాశి
మేషరాశిలో మెర్క్యురీ సంచారం వల్ల మిథున రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీని వల్ల మీ జీవితంలో పెను మార్పు రాబోతుంది. మీరు వ్యాపారంలో భారీగా లాభాలను గడిస్తారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు ధనలాభం ఉంటుంది. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. 
కర్కాటక రాశి
మేషరాశిలో మెర్క్యురీ సంచారం కర్కాటక రాశివారి జీవితంలో అనూహ్య మార్పులు తీసుకొస్తుంది. మీ కల నెరవేరుతుంది. మీరు కెరీర్ లో పురగోతి సాధిస్తారు. మీరు విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. 
సింహరాశి 
సింహ రాశి వారికి బుధ సంచారం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మీరు కెరీర్‌లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
మకరరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేషరాశిలో బుధుడు సంచారం మకరరాశి జీవితాలపై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది.  మీపై డబ్బు వర్షం కురుస్తుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు.  మీకు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Monthly Horoscope April 2023: ఏప్రిల్‌ నెలలో ఈ రాశువారికి భారీ లాభాలు, జాగ్రత్తలు కూడా తప్పనిసరి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News