Mercury Transit 2023: హిందూమతంలో జ్యోతిష్యం ప్రకారం ఒక్కో గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. ముఖ్యంగా సూర్యుడిని గ్రహాల రారాజుగా, బుధుడిని యువరాజుగా, గురుడిని గురుగ్రహంగా, శని గ్రహాన్ని న్యాయ దేవతగా ఇలా అభివర్ణిస్తుంటారు. ఈ ప్రభావం గురించి తెలుసుకుందాం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాజకుమారుడు లేదా యువరాజు బుధుడు. బుధుడిని బుద్ధి, తర్కం, వాదన, వ్యాపారానికి ప్రతీకగా భావించడం వల్ల బుధుడి ప్రతి కదలికతో ఈ అంశాలపై ప్రభావం పడుతుందంటారు జ్యోతిష్య పండితులు. సెప్టెంబర్ 16వ తేదీన బుధ గ్రహం గోచారముంది. సూర్యుడి రాశిగా భావించే సింహ రాశిలో బుధుడి సక్రమమార్గంతో చాలా అంశాలపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా 3 రాశుల జాతకులకు అమితమైన లాభం కలగనుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆకశ్మిక ధనలాభముంటుంది.
బుధుడు సింహ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి జాతకులకు సెప్టెంబర్ 16 నుంచి మొత్తం పరిస్థితే మారిపోనుంది. ఈ రాశివారిపై చాలా లాభాలు వచ్చి పడతాయి. మీరు చేపట్టిన పనులు పూర్తవుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. ఆదాయం పెరగడంతో పాటు ఆకశ్మిక ధనలాభం వల్ల ఆర్ధికంగా పటిష్టమైన స్ఠితిలో ఉంటారు. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అదృష్టం తెర్చుకుంటుంది.
బుధ గ్రహం సింహ రాశిలో సక్రమమార్గం కారణంగా ధనస్సు రాశి జాతకులకు పూర్తిగా అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగులకు కోరుకున్న పదోన్నతి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్ధికంగా ఎలాంటి కష్టాలుండవు. ఇక వ్యాపారులు ఊహించని లాభాలు ఆర్జిస్తారు. మీ కష్టార్జితం, సంబంధాల ఆధారంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. పెళ్లి జీవితం ఆనందమయమౌతుంది. ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బుధుడి సక్రమమార్గం ప్రభావం మేష రాశి జాతకులపై చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామితో బంధం బాగుంటుంది. ఆకశ్మిక ధనలాభం ఉండటం వల్ల డబ్బులు సంపాదిస్తారు. అదే సమయంలో సేవింగ్ ఉంటుంది. వ్యాపారులకు పెద్ద పెద్ద ఆర్డర్లు లభించడం వల్ల మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి, ఆదాయం పెరగడం ఉంటుంది.
Also read ; Jupiter Retrograde 2023: గురుడి వక్రమార్గంతో ఈ ఒక్క రాశివారికి డిసెంబర్ 31 వరకూ తిరుగేలేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook