Lucky Zodiac Signs: నవపంచమి యోగం ప్రభావం, ఆ 4 రాశులకు ఊహించని ధనలాభం

Lucky Zodiac Signs: హిందూ జ్యోతిష్యం ప్రకారం కొత్త ఏడాదిలో జనవరి నెల అత్యంత మహత్యం కలిగిందిగా ఉంది. కారణంగా అద్భుతమైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా 4 రాశులవారి ఖజానా డబ్బుతో నిండిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2024, 06:51 AM IST
Lucky Zodiac Signs: నవపంచమి యోగం ప్రభావం, ఆ 4 రాశులకు ఊహించని ధనలాభం

Lucky Zodiac Signs: హిందూమతంలో సుకర్మ యోగం, లక్ష్మీ నారాయణ యోగాల వల్ల దాదాపు అన్ని రాశులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా ఇవాళ గురువారం సంపదకు కారకుడిగా భావించే గురుడి రోజు. దాంతో ఈ నాలుగు రాశులపై గురు గ్రహంతో పాటు విష్ణువు కటాక్షం ప్రత్యేకంగా ఉంటుందంటున్నారు. 

ఇవాళ్టి రోజున అంటే గురువారం సూర్య, గురు గ్రహాలు ఒకదానికొకటి 9, 5వ పాదాల్లో ఉండటం వల్ల నవపంచమ యోగం ఏర్పడుతుంది. అటు చంద్రుడు తుల రాశిలో ప్రవేశించనున్నాడు. ఇవాళ రుక్మిణి అష్టమి రోజు కావడంతో చాలా శుభయోగాలు ఏర్పడనున్నాయి. సుకర్మ యోగం, లక్ష్మీ నారాయణ యోగం, హస్త నక్షత్ర శుభ సంయోగం ఏర్పడనున్నాయి. ఫలితంగా ఇవాళ్టి రోజు చాలా రాశులకు అత్యంత మహత్వపూర్వకం కానుంది. ఊహించని లాభాలు కలగనున్నాయి. 

ధనస్సు రాశి జాతకులకు అంతా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు చాలా అనువైన సమయం. మంచి లాభాలు ఆర్జిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి అవకాశం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్దిస్తారు. విద్యార్ధులకు ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధించేందుకు అనువైన సమయం. అదృష్టం తోడుగా ఉండటంతో చేపట్టే అన్ని పనులు పూర్తవుతాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. 

మేష రాశి జాతకులకు లక్ష్మీ నారాయణ యోగం కారణంగా చాలా అద్భుతంగా ఉండనుంది. కెరీర్‌లో అభివృద్ధికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజులుంటాయి. ఈ సమయంలో చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. అన్ని అనారోగ్య సమస్యలు దూరం కావచ్చు. అదృష్టం తోడుగా నిలుస్తుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగాలు లేదా పదోన్నతి ఉంటుంది. ఈ రాశి జాతకులకు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు దక్కుతాయి. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది కలగదు. 

తుల రాశి జాతకులకు ఈ సమయంలో కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. ఊహించని ఆర్ధిక లాభం కలుగుతుంది. వ్యాపారులు , ఉద్యోగులకు మంచి సమయం. ఓ విధంగా చెప్పాలంటే గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. అదృష్టం తోడుగా ఉండటంతో ఈ రాశివారికి అంతా ఆనందమే ఉంటుంది. వ్యాపారులు అమితమైన లాభాలు చూస్తారు. ఉద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి కలగడంతో ఆదాయం కూడా పెరుగుతుంది. మీ పిల్లల విజయంతో మీకు ఆనందం లభిస్తుంది. ఈ సమయంలో చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. 

ఇక సుకర్మ యోగం ప్రభావంతో కర్కాటక రాశి జాతకులకు అత్యంత లాభదాయకమైన సమయమిది. ఈ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులకు అంతా కలిసొస్తుంది. మంచి ఫలితాలు చూస్తారు. వ్యాపారులం కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. ఆర్ధికంగా లాభపడతారు. ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారులకు విశేషమైన లాభాలు ఆర్జించే సమయమిది. తోటి ఉద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. వ్యాపారులకు అద్భుత లాభాలుంటాయి. ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. 

Also read: Trigraha Yogam: ఐదేళ్లకు ఏర్పడనున్న మహా శుభయోగం, మూడు రాశులపై ఊహించని కనకవర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News