Grah Gochar in October 2022: నవగ్రహాలన్నీ ఎప్పటికప్పుడు తమ రాశిని మార్చుకుంటూనే ఉంటాయి. ఈ గ్రహాల రాశి మార్పు మొత్తం 12 రాశుల వారిపై పెను ప్రభావాన్ని చూపుతాయి. వీటి సంచారం కొందరికి అదృష్టాన్నే ప్రకాశింప జేస్తే, మరికొందరిని సమస్యల వలయంలోకి నెడుతుంది. శనిదేవుడు ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబరు 23న గమనంలోకి (Shani Gochar 2022) వస్తాడు. మరోవైపు అక్టోబరు 16న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారం వల్ల అక్టోబరు కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్టరాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటకం (Cacer): అక్టోబరులో కుజుడు రాశి మార్పు వల్ల ఈ రాశివారు లాభపడనున్నారు. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.
తుల (Libra): ఈ రెండు గ్రహాల సంచారం వల్ల తులరాశి వారు ఆర్థికంగా మెరుగుపడతారు. అనేక మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. త్వరలోనే మీరు ధనవంతులు అవ్వచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్టు మీకు లభిస్తుంది.
మిథునం (Gemini): మిథున రాశి వారికి కూడా అక్టోబర్ నెల అనేక కొత్త ఆనందాలను అందించబోతోంది. ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తున్న వారు వచ్చే నెలలో అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను అందుకుంటారు. ఈ నెలలో మీ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొత్త వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు.
వృశ్చికరాశి (Scorpio): శని దేవుడి మార్గం కారణంగా, జీవితంలో కొనసాగుతున్న ఒత్తిడి తొలగిపోతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. ఈ సమయంలో ఎక్కడైనా పెట్టుబడి పెడితే మీకు అది లాభిస్తుంది. కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారంలో పెద్ద పెద్ద డీల్స్ చేసుకునే అవకాశం ఉంది.
మీనం (Pisces): శని రాశి మారడం వల్ల ఈ రాశివారు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. జాబ్ లో కొత్త బాధ్యతలు చేపడతారు.
Also Read: Shadashtak Yog: సూర్య-రాహువుల 'షడష్టక యోగం'.. ఈ రాశులవారికి శాపం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook