Planetary Motion: గ్రహాల కదలిక ప్రభావం దీపావళిపై ఎలా ఉంటుంది, ఏ రాశులకు శుభం కలగనుంది

Planetary Motion: గ్రహాల కదలిక ప్రకారం అక్టోబర్ నెలలో చాలా మార్పులు ఉండనున్నాయి. దీపావళి కంటే ముందే కొన్ని రాశుల్లో మార్పులుంటాయి. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 29, 2022, 02:59 PM IST
Planetary Motion: గ్రహాల కదలిక ప్రభావం దీపావళిపై ఎలా ఉంటుంది, ఏ రాశులకు శుభం కలగనుంది

Planetary Motion: గ్రహాల కదలిక ప్రకారం అక్టోబర్ నెలలో చాలా మార్పులు ఉండనున్నాయి. దీపావళి కంటే ముందే కొన్ని రాశుల్లో మార్పులుంటాయి. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది తెలుసుకుందాం..

అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. వచ్చే నెలలో గ్రహాల ప్రకారం చాలా ప్రత్యేకం కానుంది. ప్రముఖ పండుగలున్న ఈ నెలలోనే గ్రహాలు, రాశుల కదలిక, వక్రమార్గం కూడా ఉండనుంది. అక్టోబర్ నెలలో సూర్య గ్రహణం కూడా ఉంటుంది.

శనిదేవుడు ధంతేరస్ రోజున వక్రమార్గం పట్టనున్నాడు. ఫలితంగా చాలా రాశులకు లాభం కలగనుంది. అటు దీపావళి మరుసటి రోజున అంటే అక్టోబర్ 25వ తేదీన సూర్య గ్రహణం ఉంటుంది. ఫలితంగా చాలా రాశులపై ప్రభావం ఉంటుంది. ఇది కాకుండా మంగళ గ్రహం అక్టోబర్ 30వ తేదీన వక్రమార్గం పట్టనుండటంతో ఆ ప్రభావం కూడా గ్రహాలపై పడుతుంది. 

మేషరాశిపై ఈ మూడు గ్రహాల కదలిక ప్రభావం శుభంగా ఉంటుంది. మేషరాశి జాతకులకు అంతులేని ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. అయితే పెట్టుబడులకు మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

కన్యారాశివారిపై కూడా గ్రహాల కదలిక ప్రభావం ఉంటుంది. ఈ రాశి జాతకులకు ప్రేమ సంబంధిత విషయాలు పటిష్టంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే..శుభ సమాచారం లభిస్తుంది. 

తుల రాశివారికి గ్రహాల కదలిక ప్రభావం చాలా లాభదాయకంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఆదాయంలో కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. అయితే ప్రయత్నం మాత్రం మానకూడదు. 

Also read: Mercury Planet Margi 2022: అక్టోబర్ 2న కన్యారాశిలో బుధుడు కదలిక... ఈ రాశులవారికి స్పెషల్ బెనిఫిట్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News