Shivlingam Rules: చాలామంది ఇళ్లలో పూజలు చేస్తుంటారు. అదేవిధంగా మీరు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకుని పూజలు చేస్తుంటే మాత్రం కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవల్సిందే. లేకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదు.. అవేంటో చూద్దాం..
ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొందరు ఇంట్లో పూజలు చేస్తే..మరికొందరు ప్రతిరోజూ గుడికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ఇళ్లలో దేవతల పూజలు చేస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం. దాంతోపాటు పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేక పద్ధతులుంటాయి. అవి తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే..కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. అదే సమయంలో ఇంట్లో శివలింగం ఉంటే..పూజలు చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. లేకపోతే శివుడి ఆగ్రహానికి గురి కావల్సి వస్తుందట.
శివలింగం ఉంచిన ప్రదేశంలో ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. పూజాస్థలం పరిసరాల్లో చెత్తలేకుండా ఉండాలి. ఇంట్లో ఉండే శివలింగం ఆకారం కూడా చేతి బొటనవేలు కంటే పెద్దది ఉండకూడదు. ఇంట్లో బొటనవేలంత శివలింగం సరిపోతుంది.
ఇంట్లో ఉంచే శివలింగంపై ఎప్పుడూ పసుపు లేదా సింధూరం పూయకూడదు. శివునికి ఎప్పుడూ చందనమే పూయాల్సి ఉంటుంది. వాస్తవానికి సింధూరం సౌభాగ్యానికి ప్రతీక. శివుడు వినాశనపు దేవుడు. అందుకే సింధూరం పూస్తే జీవితంలో కష్టాలు ఎదురౌతాయి. ఇక శివలింగం బంగారం, వెండి, స్పటికం లేదా ఇత్తడిది అయుండాలి. రాగి శివలింగం ఎప్పుడూ ఇంట్లో స్థాపించకూడదు.
శివలింగం పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తులసి ఆకులు సమర్పించకూడదు. అదే విధంగా చంపా పూలు కూడా శివుడికి సమర్పించకూడదు.
Also read: Gem Astrology: రూబీ రత్నాన్ని ధరించడం వల్ల మీ సమస్యలు తీరిపోవు, దీని కోసం ఈ చిన్న పనిచేయాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook