Gem Astrology: రూబీ రత్నాన్ని ధరించడం వల్ల మీ సమస్యలు తీరిపోవు, దీని కోసం ఈ చిన్న పనిచేయాలి!

Ruby Stone Benefits: గ్రహాల యొక్క అశుభ ప్రభావాలను పెంచడానికి మరియు అశుభాలను తగ్గించడానికి రత్నాలను ధరించమని జ్యోతిష్యులు సలహా ఇస్తారు. సూర్యుడిని అనుగ్రహం పొందాలంటే రూబీని ధరించడం మంచిది. అయితే కేవలం రత్నాలను ధరిస్తే సరిపోదు. దీనితో పాటు, ఈ పని కూడా చాలా అవసరం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2022, 02:43 PM IST
Gem Astrology: రూబీ రత్నాన్ని ధరించడం వల్ల మీ సమస్యలు  తీరిపోవు, దీని కోసం ఈ చిన్న పనిచేయాలి!

Astrological Benefits Of Wearing Ruby Gemstone: కొన్నిసార్లు సమస్య పరిష్కారం కోసం జ్యోతిష్కుడు దగ్గరకు వెళ్తాం. అతడు మన జాతకాన్ని చూసి...రాశి ప్రకారం ఈ రత్నాల ఉంగారాన్ని పెట్టుకుంటే మీ కష్టాలన్నీ పోతాయని చెబుతాడు. అయితే రత్నాన్ని పెట్టుకునేటప్పుడు రత్నశాస్త్ర (Gemology) నియమాల అనుసరించి సరైన సమయంలో దానిని  ధరించాలి. అప్పుడే తగిన ఫలితం ఉంటుంది. లేకపోతే మీరు అనుకున్నది జరగదు. దీనికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 

సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి రూబీ రత్నాన్ని (Ruby Gem Stone) ధరిస్తారు, అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని  కొందరు బాధపడుతూంటారు.  వాస్తవానికి రత్నాలకు, కుటుంభానికి సంబంధం ఉంటుంది. మీరు కుటుంబంలోని విలువైన బంధాన్ని విస్మరించినట్లయితే..మీరు రత్నం పెట్టుకున్న ఎటువంటి ప్రయోజనం ఉండదు.  

తండ్రితో రూబీకి ప్రత్యక్ష సంబంధం 
రూబీ రత్నం నేరుగా తండ్రికి సంబంధించినది. తండ్రి కుటుంబానికి అధిపతి అయినట్లే, గ్రహాలకు సూర్యుడు అధిపతి. సూర్యుడు ప్రసన్నం కావాలంటే, వారికి సంబంధించిన జీవరాశులు కూడా సంతోషంగా  ఉంచవలసి ఉంటుంది. సూర్యుని ఆత్మ తండ్రి. మీరు తండ్రిని ప్రసన్నం చేసుకుంటే తప్ప రత్నం యొక్క పూర్తి ప్రయోజనం మీరు పొందలేరు. ఖరీదైన మొబైల్ తీసుకున్న తర్వాత అందులో సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాతే అది పని చేయడం ప్రారంభిస్తుంది. అదేవిధంగా రూబీని యాక్టివేట్ చేయడానికి.. మీ నాన్నకు మీపై ఉన్న అసంతృప్తి పోగొట్టి....మీ తండ్రి సంతోషంగా ఉండేటట్లు చేయాలి. మీ తండ్రికి సేవ చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోకండి. ఆయన ఆశీస్సులు ఉంటే సూర్యుడి ప్రసన్నం అవుతాడు. 

ఒక వేళ మీ తండ్రి మరణించినట్లయితే...అతని నవ్వుతున్న ఫోటోను ఫ్రేమ్ చేయండి. దానిని ఇంటి నైరుతి మూలలో పెట్టండి. ప్రతిరోజూ ఇంటి నుండి బయలుదేరే ముందు ఆ ఫోటోకు నమస్కరించండి. అంతేకాకుండా సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన తర్వాత కూడా ఆ చిత్రపటానికి నమస్కరించండి. 

పూజా స్థలంలో దేశ జెండాను ఉంచండి
మీ ఇంటి పూజా స్థలంలో దేశ త్రివర్ణ పతాకాన్ని ఉంచి.. పూజించండి. మీరు విదేశీయులైతే...ఆ దేశపు జాతీయ జెండాను ఉంచి..పుష్పాలను సమర్పించండి. నిజానికి దేశం కూడా సూర్యునితో అనుసంధానించబడి ఉంది. కావాలంటే అక్కడే నిలబడి జాతీయగీతం చదివితే ఇంకా బాగుంటుంది.

Also Read; Nirjala Ekadashi 2022: నిర్జల ఏకాదశి ఎప్పుడు? ఆ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News